బెర్త్ పైనే మూత్ర విసర్జన చేసిన సైనికుడు; కింది బెర్త్ మహిళపై పడిన మూత్రం; పట్టించుకోని ఆర్పీఎఫ్
15 June 2024, 19:48 IST
Drunk soldier urinates on berth: గోండ్వానా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలికి ప్రయాణంలో దారుణమైన అనుభవం ఎదురైంది. పై బెర్త్ పై పడుకున్న సైనికుడు నిద్ర మత్తులో బెర్త్ పైననే మూత్ర విసర్జన చేయడంతో, ఆ మూత్రం కింది బెర్త్ లో ఉన్న ఆ మహిళపై పడింది.
మద్యం మత్తులో కింది బెర్త్ పై ఉన్న మహిళపై మూత్ర పోసిన జవాను
Drunk soldier urinates on woman: గోండ్వానా ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలో బెర్త్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కింది బెర్త్ పై ఒక మహిళ నిద్రిస్తున్న సమయంలో.. పై బెర్త్ లో పడుకున్న మద్యం మత్తులో ఉన్న ఓ సైనికుడు, నిద్రలో బెర్త్ పైననే మూత్ర విసర్జన చేయడంతో, ఆ మూత్రం ఆ మహిళపై పడింది. తాగిన మైకంలో ఉన్న సైనికుడు తన బెర్త్ లో మూత్ర విసర్జన చేశాడని, అది నిద్రిస్తున్న సమయంలో తనపై పడిందని మహిళ ఆరోపించింది.
పట్టించుకోని రైల్వే పోలీసులు
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ కు ఆ మహిళ తన బిడ్డతో కలిసి ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే మహిళ, ఆమె భర్త ఆ రైళ్లో డ్యూటీ లో రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్పీఎఫ్ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో వారు ప్రధాని కార్యాలయానికి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తన బిడ్డతో కలిసి బీ-9 బోగీలో ప్రయాణిస్తోంది.
పై బెర్త్ లో మద్యం మత్తులో జవాను..
సైనికుడికి పై బెర్త్ కేటాయించగా, మహిళకు లోయర్ బెర్త్ కేటాయించారు. ఆ సైనికుడు పూర్తిగా మద్యం మత్తులో ఉండి, బెర్త్ పైనే మూత్ర విసర్జన చేయగా, అది కింద ఉన్న మహిళపై పడింది. బాధితురాలు తన భర్తకు ఈ విషయం చెప్పింది. దాంతో, ఆయన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కు ఫిర్యాదు చేశారు. అయితే, రైల్వే హెల్ప్ లైన్ నంబర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆర్పీఎఫ్ సిబ్బంది ఎలాంటి స్పందన రాలేదని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆర్పీఎఫ్ సిబ్బంది గ్వాలియర్, ఝాన్సీ వద్ద రైలు ఎక్కారు. మహిళను సంప్రదించిన తర్వాత ఆ సైనికుడు మత్తులో, తడిగా ఉన్న ప్యాంటులో ఉండటాన్ని గమనించిన వారు ఆ సైనికుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్షంతో విసిగిపోయిన ఆ మహిళ పీఎంవో, రైల్వే మంత్రికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. అయితే, తాము ఆ మహిళ ప్రయాణిస్తున్న బోగీలోని ఆమె సీటు వద్దకు వెళ్లామని, ఆమె అక్కడ కనిపించలేదని ఆర్పీఏఫ్ పోలీసులు చెబుతున్నారు. ఆ సైనికుడు నిద్ర మత్తులో, తడిచిపోయిన ప్యాంట్ తో ఉండటాన్ని తాము చూశామని వారు చెప్పారు.