Food for Women: ఈ పొడిని మహిళలు ప్రతిరోజూ చిటికెడు తింటే చాలు, దీన్ని మహిళల వయాగ్రాగా చెప్పుకుంటారు-women just need to take a pinch of nutmeg powder every day and it is said to be womens viagra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For Women: ఈ పొడిని మహిళలు ప్రతిరోజూ చిటికెడు తింటే చాలు, దీన్ని మహిళల వయాగ్రాగా చెప్పుకుంటారు

Food for Women: ఈ పొడిని మహిళలు ప్రతిరోజూ చిటికెడు తింటే చాలు, దీన్ని మహిళల వయాగ్రాగా చెప్పుకుంటారు

Haritha Chappa HT Telugu
Jun 15, 2024 07:30 PM IST

Food for Women: మహిళలు తమ కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తినాలి. ఇంటిల్లిపాదికి వండి పెట్టే మహిళలు తమ గురించి మాత్రం శ్రద్ధ వహించరు. వీరు ప్రతిరోజూ చిటికెడు జాజిపొడిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మహిళల కోసం ప్రత్యేక ఆహారం
మహిళల కోసం ప్రత్యేక ఆహారం (Pexels)

Food for Women: మనం వాడే మసాలా దినుసులు అన్నీ వంటకాలకు రుచి ఇవ్వడమే కాదు, మన ఆరోగ్యంలో కూడా అంతర్భాగం అవుతాయి. అలాంటి వాటిల్లో జాజికాయ ఒకటి. జాజికాయను బిర్యానీలో వేసి వండడమే కాదు, సాధారణ సమయంలో కూడా మహిళలు తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం జాజికాయను మెత్తగా పొడి చేసి చిన్న డబ్బాలో వేసి దాచుకోవాలి. ప్రతిరోజూ చిటికెడు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మహిళలకు ఉండే చాలా సమస్యలు తగ్గుతాయి.

ఈ పొడితో ఎంతో ఆరోగ్యం

కొంతమంది మహిళలకు లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది. దీనివల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి. అలాంటివారు చిటికెడు జాజికాయ పొడిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే వారికి కామోద్దీపన జరుగుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక, మానసిక శ్రేయస్సు కలుగుతుంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం జాజికాయ పొడిని తాగడం వల్ల, తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో మెగ్నీషియం, మాంగనీస్, రాగి వంటి ఖనిజాలు నిండుగా ఉంటాయి. విటమిన్ బి1, విటమిన్ b6 వంటి పోషకాలు లభిస్తాయి.

లైంగిక ఆరోగ్యం

చిటికెడు జాజికాయ పొడిని పాలలో వేసి ప్రతిరోజు తాగే మహిళల్లో లైంగిక జీవితం సంతోషంగా ఉంటుంది. పురాతన కాలంలో ఇదే చిట్కాను మహిళలు పాటించేవారని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. ఈ పొడి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకే దీన్ని మహిళల వయాగ్రా అని పిలుచుకోవచ్చు.

ప్రతిరోజూ చిటికెడు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. దీన్ని పాలతో కలిపి సేవించినప్పుడు యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇది తాగాక సెరటోనిన్ విడుదలవుతుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈస్ట్రోజన్ కలిసి మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతాయి. మహిళలు తీసుకోవాల్సిన మసాలాలలో జాజికాయ పొడి ఒకటి. ఇది నిరాశ, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉంచుతుంది.

జాజికాయలో హీలింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. నరాలకు రిలాక్సేషన్ వస్తుంది. జాజికాయలోని శక్తివంతమైన ఔషధ గుణాలు నరాలను కాపాడతాయి. నిద్రలో ప్రేరేపించే సెరటోనిన్ హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఒక గ్లాసు నిండుగా పాలను తీసుకుని చిటికెడు జాజికాయ పొడిని కలుపుకుని తాగండి చాలు. మంచి ఫలితాలు మీకు కొన్ని రోజుల్లోనే కనిపిస్తాయి.

ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం జాజికాయ ఒక యాంటీ డిప్రెసెంట్. ఇది నరాలను శాంత పరచడమే కాదు.. ఇది అడాప్టోజెన్ గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మహిళలు ప్రతిరోజూ చిటికెడు జాజికాయ పొడిని తినడం చాలా అవసరం.

Whats_app_banner