తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jonathan Majors Arrested : గర్ల్​ఫ్రెండ్​పై దాడి.. మార్వెల్​ స్టార్​ అరెస్ట్​!

Jonathan Majors arrested : గర్ల్​ఫ్రెండ్​పై దాడి.. మార్వెల్​ స్టార్​ అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu

26 March 2023, 11:40 IST

  • Jonathan Majors arrested : మార్వెల్​ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్​ నటుడు జొనాథన్​ మేజర్స్​ అరెస్ట్​ అయ్యాడు. గర్ల్​ఫ్రెండ్​పై దాడి చేయడమే ఇందుకు కారణం.

జొనాథన్​ మేజర్స్​..
జొనాథన్​ మేజర్స్​..

జొనాథన్​ మేజర్స్​..

Jonathan Majors girlfriend : క్రీడ్​-3, యాంట్​ మ్యాన్​ అండ్​ ది వాస్ప్​ క్వాంటిమేనియాలో నటించిన ప్రముఖ హాలీవుడ్​ నటుడు జొనాథన్​ మేజర్స్​ను పోలీసులు న్యూయార్క్​ మానహాట్టన్​లో అరెస్ట్​ చేశారు. గర్ల్​ఫ్రెండ్​ గొంతు నులమడం, దాడి చేయడం, వేధించడం వంటి ఆరోపణలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

అసలేం జరిగిందంటే..!

స్థానిక కాలమానం ప్రకారం.. 30ఏళ్ల మహిళ నుంచి 911కు శనివారం ఉదయం కాల్​ వచ్చింది. వెంటనే అలర్ట్​ అయిన పోలీసులు.. చెల్సియాలోని 22 స్ట్రీట్​, 8 ఎవెన్యూలోని అపార్ట్​మెంట్​ వద్దకు వెళ్లారు. అక్కడే జొనాథన్​ మేజర్స్​ను శనివారం ఉదయం 11:15 ప్రాంతంలో అరెస్ట్​ చేశారు. మహిళ మెడ, తలపై స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను  పోలీసులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వివరించారు.

Jonathan Majors arrested : పోలీసులకు మహిళ చెప్పిన సమాచారం ప్రకారం.. జొనాథన్​ మేజర్స్​తో కలిసి తను బ్రూక్లిన్​లోని ఓ బార్​కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ట్యాక్సీలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంటికి వెళ్లిన అనంతరం.. మహిళపై హాలీవుడ్​ నటుడు దాడి చేశాడు. గాయాలయ్యేంతగా కొట్టాడు.

గొడవకు కారణం అదే..

జొనాథన్​ మేజర్స్​.. కొంత కాలంగా వేరే మహిళకు మెసేజ్​ చేస్తున్నట్టు ఆ మహిళకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆమె డైరక్ట్​గా చూసింది కూడా! ఇదే విషయంపై ట్యాక్సీలో నటుడిని నిలదీసింది. ఈ క్రమంలో జొనాథన్​ మేజర్స్​కు కోపం వచ్చింది.  ఇంటికి వెళ్లిన అనంతరం.. ఆమె చెయ్యి పట్టుకుని చెంప చెళ్లుమనిపించాడు. ఆ సమయంలోనే గొంతు నులిమాడు.

Jonathan Majors latest news : ఈ వ్యవహారంలో జొనాథన్​ మేజర్స్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. అతడిని జైలుకు తరలించారు. కాగా శనివారం రాత్రి అతను జైలు నుంచి విడుదలైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఇందులో జొనాథన్​ తప్పు లేదని అతని ప్రతినిధి చెబుతున్నారు. "జొనాథన్​ తప్పు లేదు. ఈ వ్యవహారం నుంచి అతడిని బయటకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాము," అని వివరించారు.

రెండు వారాల క్రితం జరిగిన ఆస్కార్స్​ వేడుకల్లో మెరిశాడు జొనాథన్​ మేజర్స్​. మళ్లీ ఇప్పుడు.. ఈ ఘటనతో వార్తలకెక్కాడు. మార్వెల్​ స్టార్​పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు తమ వద్ద సరిపడా ఆధారాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.