తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Suicide In Hotel: చికిత్సకు ఎక్కువ ఖర్చువుతోందని యువకుడి ఆత్మహత్య: హోటల్‍కు వెళ్లి ఆక్సిజన్‍తో..

Man Suicide in Hotel: చికిత్సకు ఎక్కువ ఖర్చువుతోందని యువకుడి ఆత్మహత్య: హోటల్‍కు వెళ్లి ఆక్సిజన్‍తో..

22 March 2023, 13:19 IST

  • Man Suicide in Hotel: తన దీర్ఘకాల వ్యాధికి చికిత్స కోసం ఎక్కువ ఖర్చువుతోందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

Man Suicide in Hotel: ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన వ్యాధికి చికిత్స చేయించుకునేందుకు ఖర్చు పెరిగిపోతోందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని ఓ హోటల్‍లో ఓ రూమ్‍ను తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

Man Suicide in Hotel: ఉత్తర ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న ఓ హోటల్‍లో నితేశ్ అనే యువకుడు ఓ చిన్నబ్యాగ్‍తో వచ్చి మంగళవారం రూమ్ బుక్ చేసుకున్నాడు. రూమ్‍లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. “తన వ్యాధికి చికిత్స కోసం ఖర్చు పెరుగుతూనే పోతోందనే బాధతో అతడు ప్రాణం తీసుకున్నాడు” అని పోలీసులు తెలిపారు.

ముఖానికి కవర్ బిగించుకొని..

Man Suicide in Hotel: ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించి ఉండి, మృతి చెందిన పరిస్థితిలో నితేశ్‍ను హోటల్ రూమ్‍లో పోలీసులు గుర్తించారు. ఓ చిన్న ఆక్సిజన్ సిలిండర్‌కు పైప్ ఏర్పాటు చేసి.. ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకున్నాడు నితేశ్. ఆ తర్వాత సిలిండర్ నుంచి ముఖానికి బిగించుకున్న కవర్‍లోకి ఆక్సిజన్ ప్రసరించేలా పైప్ సెట్ చేసుకున్నాడు. ఆక్సిజన్ ఓవర్ డోస్ చేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఆక్సిజన్ ఎక్కువగా ప్రసరించటంతో హృదయ స్పందన తగ్గి అతడు మృతి చెందాడు. ఈ విషయాలను పోలీసులు వెల్లడించారు.

ఆన్‍లైన్‍లో సెర్చ్ చేసి..

Man Suicide in Hotel: సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‍ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీర్ఘకాల వ్యాధితో తాను బాధ పడుతున్నానని, చికిత్సకు అయ్యే బిల్లు పెరిగి తాను భరించలేకున్నానని సూసైడ్ నోట్‍లో నితేశ్ రాశాడని పోలీసులు వెల్లడించారు. చికిత్స కోసం తన తల్లితండ్రులను ఇంకా ఖర్చు చేయించాలని అనుకోవడం లేదని, నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో ఆన్‍లైన్‍లో సెర్చ్ చేసి ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‍లో ఉందని చెప్పారు.

ఆక్సిజన్ ఓవర్ డోసేజ్‍తో మృతి చెందే విధానం గురించి అతడు ఆన్‍లైన్‍లో సెర్చ్ చేశాడని, ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉంటే సన్నిహితులతో మాట్లాడాలని, సైకాలజిస్టులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య ఆలోచనలు చేయకూడదని సూచిస్తున్నారు.