తెలుగు న్యూస్  /  National International  /  Man Arrested For Smoking Bidi On Board Bengaluru-bound Akasa Air Flight: 'But In Trains...'

Man arrested for smoking: రైళ్లో చేస్తాం కదా.. అని విమానంలోనూ అదే పని చేశాడు.. అరెస్టయ్యాడు

HT Telugu Desk HT Telugu

17 May 2023, 21:31 IST

  • Man arrested for smoking: విమానంలో ధూమపానం చేసి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. నిబంధనలు తెలియకపోవడంతో విమానం టాయిలెట్ లో ప్రవీణ్ అనే వ్యక్తి బీడీ తాగాడు. దాంతో సిబ్బంది ఆయనను అరెస్ట్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: AkasaAir/Twitter)

ప్రతీకాత్మక చిత్రం

Man arrested for smoking: తొలిసారి విమానంలో ప్రయాణించిన ఒక వ్యక్తి విమానం టాయిలెట్లో బీడీ తాగి అరెస్ట్ అయ్యాడు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Man arrested for smoking: రైళ్లో తాగుతాం కదా అని..

ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ‘ఆకాశ ఎయిర్ (Akasa Air)’ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడు విమాన ప్రయాణం చేయడం ఇదే మొదటి సారి. అతడికి విమాన ప్రయాణాల్లో అనుసరించాల్సిన నిబంధనల గురించి తెలియదు. దాంతో, అతడు విమానం వెళ్తుండగా, టాయిలెట్ (toilet) లోకి వెళ్లి బీడీ (beedi) తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విమానం బెంగళూరు చేరుకున్న తరువాత విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విమానంలో ధూమపానం చేయకూడదన్న విషయం తనకు తెలియదని ప్రవీణ్ పోలీసులకు తెలిపాడు. తాను సాధారణంగా రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో, రైళ్లోని టాయిలెట్లోకి వెళ్లి, బీడీ తాగుతుంటానని వివరించాడు. అలాగే, విమానంలో కూడా టాయిలెట్ లోకి వెళ్లి బీడీ తాగానని వివరించాడు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తూ సహ ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా వ్యవహరించినందుకు ప్రవీణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ప్రకారం విమానంలో ధూమపానం పూర్తిగా నిషేధం. ఈ సిగరెట్స్ సహా అన్ని రకాల ధూమపానం పూర్తిగా నిషేధం. అయితే, ఇటీవలి కాలంలో ఈ నిబంధనను ప్రయాణికులు తరచుగా ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా టాయిలెట్లో ధూమపానం చేస్తున్నారు.