తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fertiliser Prices Slashed By 14%: రైతులకు శుభవార్త; ఎరువుల ధరలు తగ్గింపు!

Fertiliser prices slashed by 14%: రైతులకు శుభవార్త; ఎరువుల ధరలు తగ్గింపు!

HT Telugu Desk HT Telugu

21 February 2023, 17:47 IST

  • Fertiliser prices slashed by 14%: రైతులకు శుభవార్త. ఎరువుల ధరలను 14% వరకు తగ్గిస్తూ ఎరువుల ఉత్పత్తి సంస్థ ఇఫ్కో (IFFCO Ltd)  ప్రకటించింది. ఈ నిర్ణయంతో సేద్యం ఖర్చు గణనీయంగా తగ్గనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fertiliser prices slashed by 14%: రైతులకు శుభవార్త. ఎరువుల ధరలను 14% వరకు తగ్గిస్తూ ఎరువుల ఉత్పత్తి సంస్థ ఇఫ్కో (IFFCO Ltd) ప్రకటించింది. ఈ నిర్ణయంతో సేద్యం ఖర్చు గణనీయంగా తగ్గనుంది. ఎరువుల ధరలను 14% వరకు తగ్గిస్తున్నట్లు IFFCO Ltd ప్రతినిధి వెల్లడించారు. ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గించుకుని, ఆ మేరకు రైతులకు ప్రయోజనం అందించాలన్న ఉద్దేశంతో ఎరువుల ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. నానో ఫర్టిలైజర్స్ తో పాటు, ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో ఉత్పత్తి ఖర్చు తగ్గిందని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Fertiliser prices slashed by 14%: రూ. 1200 వరకు..

దేశ ఆహార భద్రతకు, ఆహార ధాన్యాల ఉత్పత్తికి, ఎరువుల లభ్యతకు మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. రైతులకు అవసరమయ్యే కీలక ఎరువులపై ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. సబ్సీడీ మొత్తాన్ని ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం అందజేస్తుంది. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ గా పిలిచే ఎన్ పీ కే (NPK)లపై ఒక్కో బ్యాగ్ పై రూ. 200 నుంచి రూ. 1200 వరకు తగ్గిస్తున్నట్లు IFFCO ప్రతినిధి తెలిపారు. ఈ ధరల తగ్గింపు ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే, ఈ ధరల తగ్గింపుపై ఇఫ్కో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2023 24 సంవత్సరానికి ఎరువుల సబ్సీడీ భారం ప్రభుత్వంపై కనీసం రూ. 1.75 లక్షల కోట్లు ఉండవచ్చని ఒక అంచనా.