తెలుగు న్యూస్  /  National International  /  Kerala Trans-couple Ziya, Zahad Expecting Baby; 'First Pregnant Transman'

Trans-couple expecting baby: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట

HT Telugu Desk HT Telugu

03 February 2023, 22:56 IST

    • trans-couple expecting baby: కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ (trans-couple) జంట జాహద్, జియా (Ziya, Zahad) లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు తమ ఇన్ స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. 
పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట
పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట

పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట

trans-couple expecting baby: జాహద్ (Zahad) గర్భం దాల్చిన విషయాన్ని జియా (Ziya) తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించింది. డెలివరీ మార్చి నెలలో ఉండొచ్చని పేర్కొంది. స్త్రీగా మారిన పురుషుడు గర్భం దాల్చడం భారత్ లో ఇదే ప్రథమమని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

trans-couple expecting baby: బిడ్డ కోసం..

జియా, జాహద్ (Ziya, Zahad) లు కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్లు. వారు గత మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు. జన్మత: పురుషుడుగా జన్మించిన జియా (Ziya) తరువాత స్త్రీగా మారారు. జన్మత: స్త్రీగా జన్మించిన జాహద్ (Zahad) తరువాత పురుషుడిగా మారారు. ఈ ప్రాసెస్ కొనసాగుతున్న సమయంలోనే జహాద్ (Zahad) గర్భం దాల్చింది. దాంతో, వారు బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుని, తమ లింగమార్పిడికి సంబంధించిన ప్రాసెస్ ను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే, అప్పటికే జహాద్ తన స్తనాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకుంది. అయితే, గర్భాశయంలో ఎలాంటి లోపాలు లేవని, అందువల్ల గర్భం దాల్చవచ్చని డాక్టర్లు చెప్పడంతో వారు బిడ్డను కనడానికి నిర్ణయించుకున్నారు. పుట్టిన తరువాత బిడ్డకు మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్ ను పట్టించాలని వారు నిర్ణయించుకున్నారు. ‘నేను మానసికంగా స్త్రీగా ఎప్పుడూ భావించలేదు. కానీ, తల్లి కావాలన్నకోరిక, అమ్మ అని పిలిపించుకోవాలన్న కోరిక నాలో అంతర్గతంగా ఉన్నాయి కావచ్చు. అందుకే గర్భం దాల్చిన తరువాత బిడ్డను కనాలని నిర్ణయించుకున్నా’ అని జాహద్ తెలిపారు. మొదట్లో ఎవరినైనా పెంచుకుందామనుకున్నామని, అయితే, గర్భం వచ్చిన తరువాత ఆ ఆలోచన మార్చుకున్నామని వివరించారు.

టాపిక్