తెలుగు న్యూస్  /  National International  /  Kejri, Mann Greeted With Black Flags, Modi Chants In Gujarat, Aap Boss Says This

Kejriwal greeted with black flags: కేజ్రీవాల్ కు నల్లజెండాలతో స్వాగతం

HT Telugu Desk HT Telugu

29 October 2022, 18:26 IST

  • Kejriwal greeted with black flags: గుజరాత్ లో ఆప్ జెండా ఎగరేయడం కోసం కృషి చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు స్థానికుల నుంచి నల్లజెండాలతో స్వాగతం లభించింది. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్

Kejriwal greeted with black flags: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా, ఇప్పటికే పలుమార్లు గుజరాత్ లో పర్యటించి, ఎన్నికల ప్రచార సన్నాహాలను పరిశీలించారు.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

Kejriwal greeted with black flags: మోదీ, మోదీ నినాదాలు

తాజాగా, శనివారం పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ చిక్లీ అనే చోట ఆప్ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. అక్కడికి కేజ్రీవాల్, మన్ వెళ్తున్న క్రమంలో ఖుండ్వేల్, గోల్వాద్ గ్రామాల వద్ద రోడ్డుకు ఇరువైపుల నిల్చున్న బీజేపీ కార్యకర్తలు నల్ల జెండలు ఊపుతూ, మోదీ, మోదీ అని నినాదాలు చేశారు.

Kejriwal greeted with black flags: వారంతా నా సోదరులే..

అనంతరం చిక్లీ లోని నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన సభలో పాల్గొన్న కేజ్రీవాల్.. తనకు నల్లజెండాలతో స్వాగతం పలికిన వారిని ప్రస్తావిస్తూ వారంతా తన సోదరులేనని వ్యాఖ్యానించారు. త్వరలో వారి మనసులను కూడా గెలుచుకుంటానని, వారిని తమ పార్టీలో చేర్చుకుంటానని వ్యాఖ్యానించారు.

Kejriwal greeted with black flags: డబుల్ ఇంజిన్ అవసరం లేదు..

రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పదేపదే చెప్పే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం(కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం) మాటలను ప్రస్తావిస్తూ.. గుజరాత్ కు ఆ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం లేదని కేజ్రీవాల్ అన్నారు. ‘ఆ డబుల్ ఇంజిన్ లలో ఒకటి ముసలిదయింది. మరొకటి సరిగ్గా నడవడం లేదు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.