తెలుగు న్యూస్  /  National International  /  It's Fake..' Nobel Committee Member On Pm Modi Being Considered For Nobel Prize

PM Modi for Nobel Prize: మోదీకి నోబెల్ శాంతి బహుమతి!; కమిటీ మెంబర్ కీలక వ్యాఖ్య

HT Telugu Desk HT Telugu

16 March 2023, 21:07 IST

  • PM Modi for Nobel Prize: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కి ఈ సంవత్సరం నోబెల్ శాంతి (Nobel peace Prize) బహుమతి ఇవ్వనున్నారన్న వార్తలపై నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) స్పందించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (PTI)

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

PM Modi for Nobel Prize: ప్రపంచంలో అత్యంత కీలక నేతల్లో ఒకరుగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) కి నోబెల్ శాంతి బహుమతి (Nobel peace Prize) ఇవ్వనున్నారని, ఆయన పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కూడా ఈ విషయంలో భారీగా స్పందిస్తోంది. నోబెల్ శాంతి పురస్కారం (Nobel peace Prize) కోసం మోదీ (PM Modi) పేరును పరిశీలిస్తున్నరని నకిలీ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తపై నార్వేకు చెందిన నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

PM Modi for Nobel Prize: అది తప్పుడు వార్త..

నోబెల్ శాంతి పురస్కారం (Nobel peace Prize) ప్రకటించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందన్న వార్తలు పూర్తిగా అబద్ధమని, నిరాధారమని నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనేదీ కమిటీ వద్ద లేదని తేల్చి చెప్పారు. అది పూర్తిగా ఫేక్ (fake) వార్త అన్నారు. అలాంటి వ్యాఖ్య కానీ, అలాంటి వ్యాఖ్యతో సంబంధమున్న ఎలాంటి ట్వీట్ (tweet) కానీ ఏదీ తాను చేయలేదని వివరణ ఇచ్చారు. నోబెల్ శాంతి పురస్కారం (Nobel peace Prize) కోసం మోదీ (PM Modi) పేరును పరిశీలిస్తున్నరని ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ ఫేక్ అని, అసలు ఆ వార్తపై డిస్కస్ చేసి, ఆ తప్పుడు వార్తకు మరింత ప్రాచుర్యం కల్పించవద్దని నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) సూచించారు.

PM Modi for Nobel Prize: భారత పర్యటనపై..

తన భారత పర్యటన గురించి కూడా నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) వివరణ ఇచ్చారు. తాను నోబెల్ కమిటీ సభ్యుడి హోదాలో భారత్ లో పర్యటించడం లేదని, తను ఇప్పడు ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్ స్టాండింగ్ కు డైరెక్టర్ గా, భారతదేశానికి మిత్రుడిగా ఇక్కడికి వచ్చానని వివరించారు.

PM Modi for Nobel Prize: మోదీపై ప్రశంసలు..

అయితే, నోబెల్ కమిటీ సభ్యుడు ఆస్లే టోజ్ (Asle Toje) ప్రధాని మోదీపై వివిధ సందర్బాల్లో ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం (Russia Ukraine war)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ధైర్యంగా ప్రకటించడం గొప్ప విషయమని ఆస్ల టోజ్ ప్రశంసించారు. అలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తు పట్ల భరోసాను పెంచుతాయన్నారు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదంటూ మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిందన్నారు.