తెలుగు న్యూస్  /  National International  /  I-t Survey At Bbc Offices: What Is The Difference Between 'Survey' And 'Search'?

I-T survey at BBC offices: ఐటీ ‘సెర్చ్’ కు.. ఐటీ ‘సర్వే’ కు తేడా తెలుసా?

HT Telugu Desk HT Telugu

15 February 2023, 21:26 IST

  • Difference between IT survey and IT Search : భారత్ లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను అధికారులు సర్వే నిర్వహించడం ఇప్పుడు సంచలనం గా మారింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AP)

ప్రతీకాత్మక చిత్రం

Difference between IT survey and IT Search : భారత్ లోని బీబీసీ (BBC) కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత, ఆదాయ అక్రమ మళ్లింపు ఆరోపణలతో పాటు, తమ నోటీసులకు బీబీసీ (BBC) రిప్లై ఇవ్వకపోవడంతో ఈ సర్వే చేపట్టినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఐటీ దాడులు (IT Raids), ఐటీ సోదాలు (IT Search) గురించే అందరికీ తెలుసు. బీబీసీ (BBC) పై ఐటీ సర్వే న్యూస్ తో కొత్తగా ఐటీ సర్వే (IT Survey) అనే కొత్త పదం వెలుగులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Difference between IT survey and IT Search : ఐటీ సెర్చ్, ఐటీ సర్వే మధ్య తేడాలేంటి?

ఐటీ సోదాలు (IT Search), ఐటీ సర్వే (IT Survey)ల మధ్య తేడాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. వారి వివరణ ప్రకారం.. ఆదాయ పన్ను చట్టం, 1961 (Income Tax Act of 1961) ప్రకారం.. సర్వే () అనే పదానికి, సెర్చ్ () అనే పదానికి కచ్చితమైన నిర్వచనాలు ఉన్నాయి. సెర్చ్ సమయంలో ఐటీ అధికారులు ఏం చేయాలి? సర్వే సమయంలో ఐటీ అధికారులు ఏం చేయాలి? అనే విషయంలో స్పష్టమైన వివరణలు ఆదాయ పన్ను చట్టం, 1961 (Income Tax Act of 1961)లో ఉన్నాయి. ఈ రెండు విధులను కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణల విచారణ సమయంలో నిర్వర్తిస్తారు.

What is IT Survey?: ఐటీ సర్వే (IT Survey) అంటే..

ఆదాయ పన్ను చట్టం, 1961 (Income Tax Act of 1961) ప్రకారం.. ఐటీ చట్టంలోని సెక్షన్ 133ఏ (Section 133A), సెక్షన్ 133 బీ (Section 133B) ప్రకారం ఐటీ అధికారులు సర్వే (IT Survey) నిర్వహించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను సర్వే ను ఆయా వ్యాపారాలకు సంబంధించిన కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించాలి. సర్వే (IT Survey) సమయంలో.. ఆయా కార్యాలయాల్లోని బుక్స్ ను, డాక్యుమెంట్లను, సాఫ్ట్ కాపీలను, స్టాక్స్ ను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ల్లోని సమాచారాన్ని ఆదాయ పన్ను అధికారులు చెక్ చేయవచ్చు. కానీ వాటిలో వేటిని కూడా సీజ్ చేయడానికి వీలు లేదు.

What is IT search?: ఐటీ సెర్చ్ (IT search) అంటే..

ఆదాయ పన్ను అధికారులు పన్ను ఎగవేతకు, ఆర్థిక అవకతవకలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై సంబంధిత వ్యాపారాలపై సోదాలు (IT search) నిర్వహించవచ్చు. ఐటీ సెర్చ్ (IT search) సంబంధించిన విధి విధానాలు ఆదాయ పన్ను చట్టం 1961 (Income Tax Act of 1961) లోని సెక్షన్ 132 లో స్పష్టంగా ఉన్నాయి. సర్వే (IT Survey) సమయంలో కేవలం ఆయా వ్యాపార సంస్థల కార్యాలయాల్లో మాత్రమే సర్వే నిర్వహించాల్సి ఉంటుంది కానీ, సెర్చ్ (IT search) సమయంలో మాత్రం ఆయా వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాలతో పాటు బోర్డు సభ్యులు, ప్రమోటర్లు, ఇతర కీలక అధికారుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఆధారాలను పొందవచ్చు. సెర్చ్ (IT search) సమయంలో ఆస్తులను, ట్యాక్స్ బుక్స్ ను, ఆడిటింగ్ బుక్స్ ను, డాక్యుమెంట్స్ ను , పన్ను ఎగవేతతో సంబంధం ఉందని భావించిన మరే ఇతర వస్తువులనైనా ఐటీ అధికారులు సీజ్ చేయవచ్చు. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వని కారణంగా, లేదా సమాధానం ఇచ్చినప్పటికీ, అది సంతృప్తికరంగా లేని కారణంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు (IT search) నిర్వహించవచ్చు.