తెలుగు న్యూస్  /  National International  /  Ips Officer In Uttar Pradesh Reports A Crime To Check Response Of Local Police

SP surprise Inspection: నకిలీ ఫిర్యాదుతో పోలీసులను టెస్ట్ చేసిన ఎస్‍పీ

HT Telugu Desk HT Telugu

05 November 2022, 17:23 IST

  • SP surprise Inspection Viral video : పోలీసు సిబ్బంది స్పందన, పనితీరును తనిఖీ చేసేందుకు ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఓ నకిలీ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్‍గా మారింది.

మఫ్టీలో పోలీసుల పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ చారు నిగమ్
మఫ్టీలో పోలీసుల పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ చారు నిగమ్

మఫ్టీలో పోలీసుల పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ చారు నిగమ్

SP surprise Inspection Viral video: కిందిస్థాయి ఉద్యోగుల పనితీరును ఉన్నతాధికారులు తనిఖీ చేస్తుంటారు. సిబ్బంది ఎలా పని చేస్తున్నారో పర్యవేక్షిస్తుంటారు. సాధారణంగా కార్యాలయాలకు వెళ్లి.. ప్రశ్నలు వేసి వివరాలు తెలుసుకుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‍కు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్.. జిల్లా పోలీసుల పనితీరును పరీక్షించేందుకు కొత్త తరహా పద్ధతిని అవలంబించారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

SP surprise Inspection Viral video: నకిలీ ఫిర్యాదు

ఉత్తర్ ప్రదేశ్‍లోని ఔరైయా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) చారు నిగమ్ ఓ ఆకస్మిక ఇన్‍స్పెక్షన్ నిర్వహించారు. అత్యవసర కాల్స్ కు జిల్లా పోలీసులు ఎలా స్పందిస్తారో టెస్ట్ చేశారు. ఇందుకోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 112కు ఎస్‍పీ చారు నిగమ్ కాల్ చేశారు. ఆయుధాలతో వచ్చిన దుండగులు తన బ్యాగ్ దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

SP surprise Inspection Viral video: పర్స్ పోయిందని..

ఫిర్యాదులు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సిబ్బంది తనను గుర్తుపట్టకుండా సాధారణ వ్యక్తి అనుకునేందుకు ఎస్‍పీ నిగమ్ తన ముఖాన్ని దుపట్టాతో కవర్ చేసుకున్నారు. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను గుర్తుపట్టలేదు. బ్రౌన్ కలర్ లో ఉన్న తన పర్స్ దొంగతనానికి గురైందని ఆమె పోలీసులకు చెప్పారు. ఆమె చెప్పిన వివరాలను ఇద్దరు పోలీసులు రాసుకున్నారు. మొత్తానికి వేగంగా స్పందించిన పోలీసులు ఈ పరీక్షలో పాసయ్యారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను ఔరైయా పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

SP surprise Inspection Viral video: వీడియో వైరల్

“జిల్లా పోలీసుల స్పందన, అప్రమత్తతను తనిఖీ చేసేందుకు ఎస్‍పీ చారు నిగమ్ (@ipsCharuNigam).. ఆమెను గుర్తుపట్టకుండా.. ఎవరూ లేని రహదారి నుంచి 112కి కాల్ చేశారు. ఆయుధాలతో బైక్‍పై వచ్చిన దుండగులు పర్స్ దోపిడీ చేశారని నకిలీ ఫిర్యాదు చేశారు. ఈ ప్రక్రియ మొత్తం సంతృప్తికరంగా ముగిసింది” అని ఔరైయా పోలీసులు ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. లైక్స్ కూడా వేలలో ఉన్నాయి. పోలీసుల పనితీరును పరీక్షించేందుకు ఎస్‍పీ చేసిన ఆకస్మిక తనిఖీని చాలా మంది ప్రశంసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అప్రమత్తంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.