తెలుగు న్యూస్  /  National International  /  India Retail Inflation Inches Up To 7 Per Cent In August

India Retail inflation : 7శాతానికి పెరిగిన రీటైల్​ ఇన్​ఫ్లేషన్​

Sharath Chitturi HT Telugu

12 September 2022, 17:47 IST

    • India Retail inflation : దేశంలో ఆగస్టు నెలలో రీటైల్​ ఇన్​ఫ్లేషన్​.. 7శాతానికి పెరిగింది. ఇక ఆర్​బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో పెరిగిన రీటైల్​ ద్రవ్యోల్బణం
దేశంలో పెరిగిన రీటైల్​ ద్రవ్యోల్బణం (Bloomberg)

దేశంలో పెరిగిన రీటైల్​ ద్రవ్యోల్బణం

India Retail inflation : దేశంలో ఆగస్టు నెలకు సంబంధించిన రీటైల్​ ఇన్​ఫ్లేషన్​ డేటాను కేంద్రం సోమవారం ప్రకటించింది. మూడు నెలల పాటు దిగొచ్చిన ద్రవ్యోల్బణం.. ఆగస్టు నెలలో ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆగస్టు నెలలో రీటైల్​ ద్రవ్యోల్బణం 7శాతానికి చేరింది. తాజా పరిణామాలతో.. వడ్డీ రేట్ల పెంపుపై ఆర్​బీఐ మరింత తీవ్రంగా వ్యవహరించే అవకాశం ఉంది!

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

దేశంలో గత కొన్ని వారాలుగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. కానీ ఆగస్టు నెలలో రీటైల్​ ఇన్​ఫ్లేషన్​ పెరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

గోధుమ, వరి, పప్పులు వంటి ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సీపీఐ(కన్జ్యూమర్​ ప్రైజ్​ ఇండెక్స్​)లో అధిక భాగం ఆహార ద్రవ్యోల్బణానిదే.

డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం.. 7.62శాతంగా నమోదైంది. జులైలో అది 6.69శాతంగా ఉండేది. ఇక 2021 ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం 3.11శాతంగా ఉండటం గమనార్హం.

Retail Inflation data : దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంట చేతికి రావడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో.. అధిక వర్షాల కారణంగా పంట నాశనమైపోతోంది. వీటి ప్రభావంతో రానున్న నెలల్లో ఆహార ధరల మరింత పెరిగే అవకాశం లేకపోలేదు!

2023 తొలినాళ్ల నాటికి రీటైల ద్రవ్యోల్బణాన్ని 6శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్​బీఐ. అందుకు తగ్గట్టుగానే అంచనాలు కూడా వేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్​- జూన్​ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం 5శాతానికి చేరుతుందని అభిప్రాయపడింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆగస్టులో రీటైల్​ ఇన్​ఫ్లేషన్​ ఏకంగా 7శాతానికి చేరింది.

RBI rate hike : తాజా పరిణామాలతో ఆర్​బీఐ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్​లో అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టులో వడ్డీ రేట్లను 50బేసిస్​ పాయింట్లు పెంచింది ఆర్​బీఐ. ఈ నెల 30న పాలసీ మీటింగ్​లో వడ్డీ రేట్ల పెంపు ఏ విధంగా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.