Retail inflation: 7.01 శాతానికి తగ్గిన రీటైల్ ఇన్‌ఫ్లేషన్-retail inflation eases marginally to 7 01 pc in june ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Retail Inflation: 7.01 శాతానికి తగ్గిన రీటైల్ ఇన్‌ఫ్లేషన్

Retail inflation: 7.01 శాతానికి తగ్గిన రీటైల్ ఇన్‌ఫ్లేషన్

HT Telugu Desk HT Telugu
Jul 12, 2022 06:15 PM IST

Retail inflation: రీటైల్ ఇన్‌ఫ్లేషన్ జూన్ నెలలో 7.01 శాతానికి తగ్గిందని కేంద్రం ప్రకటించింది.

స్వల్పంగా తగ్గిన రీటైల్ ఇన్‌ఫ్లేషన్
స్వల్పంగా తగ్గిన రీటైల్ ఇన్‌ఫ్లేషన్ (Bloomberg)

న్యూఢిల్లీ, జూలై 12: ఇండియా రీటైల్ ఇన్‌ఫ్లేషన్ జూన్‌లో స్వల్పంగా 7.01 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో ఇది 7.04 శాతంగా ఉంది. ఆహార ధరల్లో స్వల్ప తగ్గుదల వల్ల ఇది సాధ్యమైంది. అయినప్పటికీ ఇది రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న సహన పరిమితి స్థాయి పైనే ఉంది.

కాగా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత ఇన్‌ఫ్లేషన్ మే నెలలో 7.04 శాతంగా ఉంది. జూన్ 2021లో అది 6.26 శాతంగా ఉంది.

ఆహార కేటగిరీలో ఇన్‌ఫ్లేషన్ జూన్ 2022లో 7.75 శాతంగా ఉంది. అంతకుముందు అది 7.97 శాతంగా ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్ఓ) డేటా చెబుతోంది.

కాగా ద్రవ్యోల్భణం రెండు శాతం అటుఇటుగా 4 శాతం ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ జనవరి 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ గరిష్ట సహన పరిమితి 6 శాతం పైనే రీటైల్ ఇన్‌ఫ్లేషన్ ఉంటోంది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో 7.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ వేసిన అంచనాల కంటే 22 బేసిస్ పాయింట్లు తక్కువగానే ఉందని, మానిటరీ పాలసీ కమిటీ ఈ గణాంకాల ఆధారంగా ఓదార్పు ఇస్తుందని, ఆగస్టు సమావేశంలో మరో 25-35 బేసిస్ పాయింట్ల మధ్యే రెపో రేటు పెరుగుదల ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్