తెలుగు న్యూస్  /  National International  /  India May See Covid Surge In January, Next 40 Days Crucial: Report

India may see Covid surge in January: జనవరిలో కొరోనాతో జాగ్రత్త..

HT Telugu Desk HT Telugu

28 December 2022, 19:21 IST

  • India may see Covid surge in January: పలు దేశాల్లో కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్ లో ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. కొరోనా(corona) కట్టడికి కఠిన చర్యలు చేపట్టల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పరిశీలన
న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పరిశీలన

న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పరిశీలన

India may see Covid surge in January: కొరోనా మళ్లీ పడగ విప్పుతోందన్న ఆందోళనకర వార్తల నడుమ అధికారులు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించారు. ఈ చలికాలం సీజన్ చాలా కీలకమని, ఈ సీజన్ లో కొరోనా ప్రబలకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

January is very crucial: జనవరి లో జాగ్రత్త..

చైనా, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ప్రారంభమైన కొరోనా(corona) వేవ్.. భారత్ లోనూ వ్యాపించకుండా ఉండాలంటే, రానున్న 40 రోజులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని వైద్య అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జనవరి నెలలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని, జనవరి లో కేసుల సంఖ్య పెరగనట్లయితే, ఇక ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చని వివరిస్తున్నారు.

India may see Covid surge in January: గతంలో ఇలాగే..

2020 మార్చ్ లో కొరోనా(corona) ప్రారంభమైన తరువాత.. వరుసగా వచ్చిన వేవ్ లను పరిశీలించిన అధికారులు.. భారత్ లో కొత్త వేవ్ వచ్చే ముందు పరిణామాలను వివరిస్తున్నారు. గతంలో కూడా తూర్పు ఆసియా దేశాల్లో corona కేసుల సంఖ్య భారీగా పెరిగిన 30, 35 రోజుల తరువాతనే భారత్ లో corona కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సారి కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు. డెల్టా వేరియంట్ తో జరిగినంతగా విధ్వంసం ఇకపై జరగకపోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7 (Omicron sub-variant BF.7.) వేరియంట్ తో కేసుల సంఖ్య పెరగవచ్చు కానీ, కోవిడ్(covid) వ్యాధి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని, ఆసుపత్రిలో చేరాల్సని పరిస్థితి కూడా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

టాపిక్