తెలుగు న్యూస్  /  National International  /  In A First, Affordable Housing Scheme For Transgenders Proposed In Maharashtra

ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకం.. దేశంలోనే తొలిసారిగా..!

Sharath Chitturi HT Telugu

07 August 2022, 16:41 IST

    • Transgenders housing scheme : దేశంలోనే తొలిసారిగా.. ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రణాళికలు రచిస్తోంది. 
ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకం.. దేశంలోనే తొలిసారిగా..!
ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకం.. దేశంలోనే తొలిసారిగా..! (HT File)

ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకం.. దేశంలోనే తొలిసారిగా..!

Transgenders housing scheme : ట్రాన్స్​జెండర్ల సంక్షేమం కోసం.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! ట్రాన్స్​జెండర్ల కోసం గృహ నిర్మాణ పథకాన్ని ప్రతిపాదించింది మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. దేశంలోనే తొలిసారిగా.. ఓ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్​జెండర్ల కోసం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టినట్టు అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

ప్రతిపాదిత పథకం ప్రకారం.. 450 స్క్వేర్​ ఫీట్​లు ఉండే 150 ఫ్లాట్లు ట్రాన్స్​జెండర్లకు ఇస్తారు. నాగ్​పూర్​ నగరంలో హౌజింగ్​ కాంప్లెక్స్​ను ట్రాన్స్​జెండర్లకు కేటాయిస్తారు.

"నాగ్​పూర్​ ఇంప్రూవ్​మెంట్​ ట్రస్ట్​ వద్ద ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని అమ్మేందుకు అంగీకరించింది. ప్రధానమంత్రి ఆవాస్​ యోజన్​ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో.. ఈ ఇళ్లను తీసుకుని ట్రాన్స్​జెండర్లకు కేటాయిస్తాము. ఇవి వారి సొంతమవుతాయి," అని సోషల్​ వెల్ఫేర్​కు కమిషనర్​ డా. ప్రశాంత్​ నర్నవారే వెల్లడించారు.

ప్రస్తుతం ప్రతిపాదన సిద్ధంగా ఉన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రశాంత్​ వెల్లడించారు. ఆర్థికశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే.. ఎన్​ఐటీ నుంచి ఫ్లాట్​లను కొనుగోలు చేసి, ట్రాన్స్​జెండర్లకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

"ట్రాన్స్​జెండర్లకు చాలా కష్టాలు ఉన్నాయి. వారికి ఇల్లు ఇచ్చేందుకు కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. వీరిలో చాలమంది మురికివాడలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరుగా, కొత్త ఇళ్లు ఇస్తే.. సమాజంలో చీలిక తెస్తున్నట్టు మీరు భావించవచ్చు. మా ఉద్దేశం అది కాదు. ట్రాన్స్​జెండర్లు కూడా ప్రజలతో కలిసి జీవించాలనే మేము అనుకుంటాము. కానీ వారికి సౌకర్యాలు, మంచి జీవితం దక్కాలి," అని ప్రశాంత్​ వెల్లడించారు.

గృహ నిర్మాణ పథకం ద్వారా ఫ్లాట్లు కావాలని అనుకునే ట్రాన్స్​జెండర్ల వద్ద ఐడీ కార్డు ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన ట్రాన్స్​జెండర్​ సర్టిఫికేట్​ ఉండాలి. ఫ్లాట్​ ధరలో 10శాతం ట్రాన్స్​జెండర్లు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే.. అందుకు బ్యాంక్​ లోన్​లు కూడా తీసుకోవచ్చని ప్రశాంత్​ స్పష్టం చేశారు.

టాపిక్