How to check bank balance using Aadhaar : ఆధార్‌తో బ్యాంకు బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి?
03 September 2022, 13:02 IST
- How to check bank balance using Aadhaar card : ఆధార్ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే..
ఆధార్‌తో బ్యాంకు బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి?
How to check bank balance using Aadhaar card : ఆధార్ కార్డు లేనిదే ఇప్పుడు దేశంలో ఏ పని జరగడం లేదు! మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు.. ఇలా అన్నింటికీ ఈ ఆధార్ కార్డు లింక్ అయిపోయింది. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు ఉంటాయి. మీ బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ కూడా ఈ ఆధార్ లింక్ చేసి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అయితే.. ఈ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్‌తో బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చని మీకు తెలుసా?
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించలేని వృద్ధులకు ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. కేవలం నాలుగు స్టెప్స్‌తోనే ఆధార్ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డుతో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే..
- స్టెప్ 1:- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీద *99*99*1# కి డైల్ చేయండి.
- స్టెప్ 2:- 12 డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ టైప్ చేయిండి.
- స్టెప్ 3:- ఆధార్ కార్డు నెంబర్‌ను వెరిఫై చేసుకోండి.
- స్టెప్ 4:- యూఐడీఏఐ నుంచి మీకు ఒక ఫ్లాష్ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి.
Aadhaar card bank balance : ఆధార్ కార్డుతో బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే కాకుండా.. మనీ ట్రాన్స్ఫర్, పాన్ కార్డు అప్లై చేసుకోవడం వంటి పనులు కూడా చేయవచ్చు!
మరోవైపు ఇంటింటికి వెళ్లి.. ఫోన్ నెంబర్‌ను ఆధార్ కార్డుకు లింక్ చేసే ప్రక్రియను చేపట్టాలని యూఐడీఏఐ భావిస్తోంది. ఇందుకోసం సన్నద్ధమవుతోంది. ఫలితంగా.. మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన పని కూడా ఉండదు!
ఆధార్ వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
Aadhaar details update : ఆధార్‌లో మన వ్యక్తిగత వివరాలను సరిగ్గా పొందుపరచడం ఎంతో ముఖ్యం. మరి ఆధార్‌లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది?
ఆధార్‌లో పేరు..
ఆధార్ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
డేట్ ఆఫ్ బర్త్ వివరాలు..
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ వివరాలను కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. "కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. ఆధార్ సెంటర్లో అప్డేట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత యూఐడీఏఐ రీజనల్ ఆఫీసుకు వెళ్లి ఆమోదం పొందవచ్చు. కొన్ని చెక్కింగ్ల తర్వాత ఆమోదం లభిస్తుంది," అని యూఐడీఏఐ చెప్పింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాపిక్