Aadhaar details update : ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?-know how many times can we update aadhar details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Know How Many Times Can We Update Aadhar Details

Aadhaar details update : ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?

Sharath Chitturi HT Telugu
Aug 28, 2022 06:00 PM IST

Aadhaar details update : ఆధార్​ వివరాలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చా? లేక వాటికి పరిమితులు ఏమైనా ఉన్నాయా?

ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? (HT_PRINT)

Aadhaar details update : ఆధార్​.. ఇప్పుడు ఇది భారతీయుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆధార్​ లేనిదే దాదాపు ఏ పనీ జరగడం లేదు. ఇంత కీలకమైన ఆధార్​లో మన వ్యక్తిగత వివరాలను సరిగ్గా పొందుపరచడం ఎంతో ముఖ్యం. మరి ఆధార్​లోని వివరాలను ఎన్నిసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది?

ఆధార్​లో పేరు..

ఆధార్​ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలు..

ఆధార్​ కార్డులో డేట్​ ఆఫ్​ బర్త్​ వివరాలను కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్​ చేసుకునేందుకు వీలు ఉంటుంది. "కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. ఆధార్​ సెంటర్​లో అప్డేట్​ కోసం రిక్వెస్ట్​ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత యూఐడీఏఐ రీజనల్​ ఆఫీసుకు వెళ్లి ఆమోదం పొందవచ్చు. కొన్ని చెక్కింగ్​ల తర్వాత ఆమోదం లభిస్తుంది," అని యూఐడీఏఐ చెప్పింది.

లింగం..

AAdhaar : ఆధార్​లో లింగం(జెండర్​)కి సంబంధించిన వివరాలను ఒక్కసారి మాత్రమే అప్డేట్​ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తారు. ఆధార్​ సెంటర్​కి వెళ్లి రిక్వెస్ట్​ పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాంతీయ యూఐడీఏఐ సెంటర్​కు వెళ్లాల్సి ఉంటుంది.

ఆధార్​ వివరాల అప్డేట్​ కోసం ఎంత ఖర్చు అవుతుంది?

ఆధార్​ ఆన్​లైన్​ సేవల కోసం మొబైల్​ ఫోన్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. ఆ మొబైల్​ నెంబర్​ను ఆన్​లైన్​లో అప్డేట్​ చేసుకోలేము. సమీపంలోని ఆధార్​ సేవా కేంద్రం, ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ అప్డేట్​ సెంటర్​కు వెళ్లి మొబైల్​ నెంబర్​ అప్డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

మ్యాండేటరీ బయోమెట్రిక్​ అప్డేట్​ కోసం ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. డెమోగ్రాఫిక్​ అప్డేట్​ కోసం రూ. 50 వసూలు చేస్తారు. బయోమెట్రిక్​ అప్డేట్​ రూ. 100 ఉంటుంది. బయోమెట్రిక్​తో పాటు డెమోగ్రాఫిక్​ అప్డేట్​ కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్