Aadhaar rules | ఇక ఆ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే ఆధార్ త‌ప్ప‌నిస‌రి-aadhaar number mandatory to get govt benefits subsides uidai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadhaar Rules | ఇక ఆ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే ఆధార్ త‌ప్ప‌నిస‌రి

Aadhaar rules | ఇక ఆ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే ఆధార్ త‌ప్ప‌నిస‌రి

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 10:47 PM IST

Aadhaar rules | ఆధార్ నంబర్ లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ లేని వారు ఇక‌పై ప్రభుత్వ రాయితీలు మరియు ప్ర‌భుత్వ ప్రయోజనాలను పొందలేరని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (Unique Identification Authority of India - UIDAI)) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో తెలియజేసింది.

ఆధార్‌
ఆధార్‌

Aadhaar rules | ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వినియోగించుకోవాల‌న్నా, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొందాల‌న్నా ఇక‌పై క‌చ్చితంగా ఆధార్ ఉండాల‌ని UIDAI స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అన్ని కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌ల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ లేకుండా పౌరులు ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి వీల్లేకుండా నిబంధ‌న‌లు రూపొందించాల‌ని సూచించింది.

Aadhaar rules | 99 శాతం

ఇప్పిటికే భార‌త్‌లోని 99 శాతం వ‌యోజ‌నుల‌కు ఆధార్‌ను అందించామ‌ని UIDAI వెల్ల‌డించింది. అయినా, ఆధార్ నెంబ‌ర్ ఇంకా కేటాయించ‌ని వారు ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొంందేందుకు ఆధార్ చ‌ట్టంలో ఒక వెసులుబాటు ఉంది. వేరే అధికారిక‌, విశ్వ‌స‌నీయ గుర్తింపు ప‌త్రాల‌ను చూపి వారు ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఆధార్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 7 ఈ వెసులుబాటు క‌ల్పిస్తోంది. అయితే, ఇక‌పై ఈ వెసులుబాటు ఉన్న‌ప్ప‌టికీ.. ఆధార్ లేని వారు క‌నీసం ఆధార్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లుగా ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌ను సంబంధిత అధికారుల‌కు చూపాల్సి ఉంటుంది.

IPL_Entry_Point