తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Silver Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు…

Gold Silver Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు…

HT Telugu Desk HT Telugu

26 September 2022, 7:38 IST

    • Gold and Silver Price today : దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత వారం బంగారం ధరల్లో పెరుగుదల నమోదు కాగా సోమవారం కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,240గా నమోదైంది. సోమవారం మార్కెట్లలో వెండి రేటు కూడా తగ్గింది.
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు.. (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు..

Gold and silver price today : బంగారం ధరలు నిలకడగా ఉండట్లేదు. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా గత కొన్ని నెలలుగా ధరలు పైకి వెళ్లాయి. గత వారం ధరలతో పోలిస్తే సోమాం ధరలు భారీగానే దిగివచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.500 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం పై కూడా రూ. 530 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,200గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,000 వద్ద కొనసాగుతోంది. సోమవారం మార్కెట్లలో వెండి ధరపై రూ. 500 తగ్గి, హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.61,500గా ఉంది.

Gold silver price: ఆంధ్రప్రదేశ్‌లో బులియన్ ధరలు....

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,000గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,200గా నమోదైంది. విజయవాడ మార్కెట్లలో వెండి ధర కిలో రూ. 61,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది.

Gold silver price: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ధరలు....

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,150గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,350 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,050గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,200గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,000 వద్ద కొనసాగుతోంది.

Platinum Price: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 1110 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,310గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,310గా ఉంది.