తెలుగు న్యూస్  /  National International  /  Gate 2023 Results Announced By Iit Kanpur Around 18 Percent Qualify

GATE 2023 results: గేట్ 2023 ఫలితాలు విడుదల

HT Telugu Desk HT Telugu

17 March 2023, 9:02 IST

    • GATE 2023 results: గేట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 18 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
గేట్ రిజల్ట్స్ విడుదల
గేట్ రిజల్ట్స్ విడుదల (Getty Images/iStockphoto)

గేట్ రిజల్ట్స్ విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ గురువారం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2023 ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం 29 సబ్జెక్టుల్లో సుమారు 6.70 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5.17 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. సుమారు 1 లక్ష మంది అర్హత సాధించారని, మొత్తం ఉత్తీర్ణత శాతం 18 శాతానికి చేరుకుందని పరీక్షా నిర్వాహక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం హాజరు 77 శాతంగా నమోదైంది. ఫిబ్ర‌వ‌రి 4, 5, 11, 12 తేదీల్లో ఎనిమిది సెష‌న్స్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వ‌హించారు.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

‘గేట్ 2023 ఇరవై తొమ్మిది సబ్జెక్టులలో నిర్వహించాం. హాజరైన 5.17 లక్షల మంది నుండి సుమారు 1 లక్ష మంది అభ్యర్థులు గేట్ 2023 పరీక్షలో అర్హత సాధించారు. గేట్ 2023 అర్హులైన అభ్యర్థుల సంఖ్య 18 శాతంగా ఉంది.’. అని ఐఐటీ కాన్పూర్ తెలిపింది.

‘12 పేపర్లు 20 శాతం కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్ పేపర్‌లో దాదాపు 25 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు..’ అని పేర్కొంది.

గేట్ స్కోర్‌కార్డులు మార్చి 22 నాటికి gate.iitk.ac.inలో అందుబాటులో ఉంటాయి. మే 31 వరకు ఎటువంటి రుసుము లేకుండా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్, హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లలోని వివిధ సబ్జెక్టులలో జాతీయ స్థాయిలో గేట్ నిర్వహిస్తారు.

గేట్ స్కోర్‌లను ప్రభుత్వ-రంగ సంస్థల్లో ప్రవేశం, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో (పీఎస్‌యూ) ఉపాధి కోసం ఉపయోగించవచ్చు. అలాగే ఉపకారవేతనాలు పొందవచ్చు.

Gate 2023 Results: గేట్ 2023 ఫలితాలను చెక్ చేసుకోండిలా..

ముందుగా గేట్ అధికారిక వెబ్‍సైట్ gate.iitk.ac.in లోకి వెళ్లాలి.

రిజల్ట్స్ వెల్లడయ్యాక.. అక్కడ గేట్ 2023 రిజల్ట్స్ అనే లింక్ కనిపిస్తుంది.

లింక్‍పై క్లిక్ చేశాక లాగిన్ అవ్వాలి.

లాగిన్ పూర్తయ్యాక మీ రిజల్ట్స్ కనిపిస్తుంది.

టాపిక్