తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epfo Interest To Pf Accounts: ఈపీఎఫ్ఓ ఖాతాల్లో వడ్డీ జమ; చెక్ చేసుకోండిలా..

EPFO interest to PF accounts: ఈపీఎఫ్ఓ ఖాతాల్లో వడ్డీ జమ; చెక్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu

04 November 2022, 20:57 IST

  • EPFO interest to PF accounts: Employees’ Provident Fund Organisation (EPFO) చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. త్వరలోనే మీ ఖాతాల్లో ఈ వడ్డీ క్రెడిట్ అవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPFO interest to PF accounts: ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాదారులకు శుభవార్త. EPFO ఖాతాల్లో వడ్డీ జమ చేయడాన్ని సంస్థ ప్రారంభించింది. మొత్తం వడ్డీని జమ చేస్తున్నామని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. EPFO ఖాతాల్లో వడ్డీ జమ కావడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 31 న EPFO ఈ వివరణ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

EPFO interest to PF accounts: వడ్డీ రేటు నిర్ణయం

ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న EPFO ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన సామాజిక భద్రత సంస్థ(Social Security Organisations)లో ఒకటి. చందాదారుల సంఖ్య, లావాదేవీల సంఖ్య పరంగా ఇది తొలి స్థానంలో ఉంది. దీని విషయంలో తుది నిర్ణయాలు తీసుకునే అధికారం Central Board of Trustees (CBT) కి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలకు సంబంధించి వడ్డీ రేటును CBT ప్రతీ సంవత్సరం నిర్ణయిస్తుంది. ఈ వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలించి, ఆమోదిస్తుంది. ఈ CBT కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.

EPFO interest to PF accounts: 8.10 శాతం వడ్డీ

ఈ మార్చి నెలలో EPF ఖాతాల వడ్డీ రేటును CBT 8.1%గా నిర్ణయించింది. ఇది గత 45 ఏళ్లలో అత్యంత కనిష్టం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో EPF ఖాతాల్లో ఈ వడ్డీ రేటు ప్రకారం ఇంట్రెస్ట్ జమ అవుతుంది. నిజానికి, ఈపీఎఫ్ ఖాతాల్లోని డబ్బుపై ప్రతీ నెల వడ్డీ లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని అదే నెల ఖాతాలో జమ అయినట్లుగా భావించి, ఆ మొత్తంపై తదుపరి నెల వడ్డీని లెక్కిస్తారు. అయితే, ఆ వడ్డీని అకౌంట్లో జమ చేయడం మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు.

EPFO interest to PF accounts: వడ్డీ క్రెడిట్ అయిందో, లేదో ఇలా తెలుసుకోండి

EPFO వెబ్ సైట్ లోని పాస్ బుక్ లో ఆ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అయతే, మీ ఖాతాలో వడ్డీ జమ అయిందో, లేదో తెలుసుకోవడం ఎలా?

  • EPFO అధికారిక website https://www.epfindia.gov.in కి వెళ్లండి.
  • ఆ తరువాత అక్కడి సర్వీసెస్ 'Services' సెక్షన్ లోకి వెళ్లండి. ఇది డాష్ బోర్డులో పైన ఉంటుంది.
  • సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్లిన తరువాత అక్కడ ‘ఫర్ ఎంప్లాయీస్’ '(For Employees) అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
  • కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సర్వీసెస్ సెక్షన్ కింద ఉన్న 'Member Passbook' పై క్లిక్ చేయండి. వెంటనే మీరు లాగిన్ పేజ్ లోకి వెళ్తారు.
  • మీ UAN ను, పాస్ వర్డ్ ను, captcha code ను ఎంటర్ చేసి, 'Login' పై క్లిక్ చేయండి. అప్పుడు EPF account వివరాలు కనిపిస్తాయి. మీ నుంచి, మీ యజమాని నుంచి వచ్చిన నెలవారీ మొత్తాలు తేదీల వారీగా వరుస క్రమంలో కనిపిస్తాయి. అలాగే, అక్కడే, మీరు పొందిన వడ్డీ మొత్తం కూడా కనిపిస్తుంది. ఏ తేదీన ఆ మొత్తం మీ ఖాతాలో జమ అయిందో కూడా తెలుస్తుంది.
  • అవసరం అనుకుంటే, మీ పాస్ బుక్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు.
  • మీ ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపడం ద్వారా కూడా మీ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ‘EPFOHO UAN ENG’ అని 7738299899 అనే నెంబర్ కు SMS చేస్తే, వెంటనే మీ బ్యాలెన్స్ వివరాలతో మీకు మరో SMS వస్తుంది. ఇక్కడ ENG అంటే, మీ బ్యాలెన్స్ వివరాలు వచ్చే భాష. ఒకవేళ మీరు ఆ వివరాలను తెలుగులో కావాలనుకుంటే ‘EPFOHO UAN TEL’ అని SMS చేయాల్సి ఉంటుంది.
  • 011-22901406 లేదా 9966044425. ఈ రెండు నెంబర్లలో దేనికైనా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ EPF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.