తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan In Unsc: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశంగా పాకిస్తాన్

Pakistan in UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశంగా పాకిస్తాన్

HT Telugu Desk HT Telugu

08 June 2024, 18:04 IST

google News
  • ఐక్య రాజ్య సమితి భద్రతామండలి సభ్య దేశంగా పాకిస్తాన్ స్థానం సంపాదించింది. మొత్తం 15 సభ్య దేశాలుండే భద్రతామండలిలో ప్రతీ రెండేళ్లకు 5 సభ్య దేశాలు మారుతుంటాయి. పాకిస్తాన్ యూఎన్ఎస్సీ సభ్య దేశంగా రెండేళ్లు కొనసాగుతుంది. పాక్ తో పాటు

    డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా సభ్యదేశాలుగా ఎన్నికయ్యాయి.

ఐరాస భద్రతామండలి సభ్య దేశంగా పాకిస్తాన్
ఐరాస భద్రతామండలి సభ్య దేశంగా పాకిస్తాన్ (AFP)

ఐరాస భద్రతామండలి సభ్య దేశంగా పాకిస్తాన్

డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో గురువారం జరిగిన రహస్య ఓటింగ్ లో సభ్యత్వం లభించింది. భద్రతామండలిలో పాకిస్థాన్ ఏడు సార్లు, పనామా ఐదు సార్లు, డెన్మార్క్ నాలుగు సార్లు, గ్రీస్ రెండుసార్లు, సోమాలియా ఒకసారి సభ్యదేశాలు సభ్యదేశాలుగా నిలిచాయి.

రెండేళ్ల కాలపరిమితి

193 మంది సభ్యులున్న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో రెండేళ్ల పాటు సభ్య దేశాలుగా కొనసాగేందుకు ఐదు దేశాలను ఎన్నుకునేందుకు ఓటింగ్ జరుగుతుంది. 15 మంది సభ్యులున్న భద్రతా మండలిలో 10 నాన్ పర్మినెంట్ స్థానాలను ప్రాంతీయ గ్రూపులకు కేటాయిస్తారు. వారు సాధారణంగా తమ అభ్యర్థులను ఎన్నుకుంటారు. కానీ కొన్నిసార్లు వారు ఏకాభిప్రాయానికి రాలేరు. ఈ ఏడాది అలాంటి సర్ ప్రైజ్ లు ఏమీ లేవు. గత సంవత్సరం, తూర్పు యూరోపియన్ ప్రాంతీయ సమూహానికి ప్రాతినిధ్యం వహించే స్థానం కోసం స్లోవేనియా రష్యా యొక్క సన్నిహిత మిత్రదేశం బెలారస్ ను చిత్తుగా ఓడించింది.

రీజనల్ గ్రూప్స్ కోసం..

ఈసారి రీజనల్ గ్రూప్స్ లో ఆఫ్రికా సీటు కోసం సోమాలియా, ఆసియా-పసిఫిక్ సీటు కోసం పాకిస్తాన్, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ సీటు కోసం పనామా, రెండు పాశ్చాత్య స్థానాలకు డెన్మార్క్, గ్రీస్ లు పోటీ పడ్డాయి. అయితే,వాటికి ఎలాంటి పోటీ లేకపోవడంతో అవి భద్రతామండలి (UNSC) తాత్కాలిక సభ్య దేశాలుగా సునాయాసంగా ఎన్నికయ్యాయి. భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలుగా మొజాంబిక్, జపాన్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్ దేశాల పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్తగా ఎన్నికైన సభ్య దేశాల పదవీకాలం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది.

వీటో అధికారం ఉండదు

భద్రతామండలి సభ్య దేశాల్లో వీటో అధికారం ఐదు శాశ్వత సభ్యదేశాలకే ఉంటుంది. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అల్జీరియా, గయానా, దక్షిణ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా దేశాలు గత సంవత్సరం తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత భద్రతా మండలిపై ఉంటుంది. కానీ, వీటో అధికారం ఉన్న సభ్య దేశాల కారణంగా ఈ విషయంలో భద్రతామండలి సమర్ధవంతంగా పని చేయలేకపోతోంది. ఇది రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, హమాస్ -ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో స్పష్టమైంది.

తదుపరి వ్యాసం