India abstains, Russia vetoes UNSC resolution: రష్యాకు మరోసారి ఇండియా మద్దతు
India abstains, Russia vetoes UNSC resolution: ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్ మిత్రదేశం రష్యాకు మరోసారి మద్దతుగా నిలిచింది. ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఐరాసలో జరిగిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.
India abstains, Russia vetoes UNSC resolution: ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రిఫరెండం ద్వారా రష్యాలో విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది.
India abstains, Russia vetoes UNSC resolution: భారత్, చైనా దూరం..
అక్రమ రిఫరెండం ద్వారా ఆ నాలుగు ప్రాంతాలను రష్యా విలీనం చేసుకుందని అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రష్యా చర్యపై ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో చర్చ, ఓటింగ్ జరిగింది. రష్యా మిత్ర దేశాలైన భారత్, చైనా ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానాన్ని వీటో చేసింది.
India abstains, Russia vetoes UNSC resolution: అమెరికా, అల్బేనియా
ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలైన లుహాన్స్క్, డోనెస్క్స్, ఖేర్సన్; జపోరిఝయ ల్లో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు నిర్వహించినది అక్రమ రిఫరెండమని, ఆ రిఫరెండం ఆధారంగా ఆ ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరించదని పేర్కొంటూ ఐరాస భద్రతామండలిలో అమెరికా, అల్బేలియా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానాన్ని భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 10 సమర్ధించాయి. భారత్, చైనా, బ్రెజిల్, గేబన్ లు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. భద్రతామండలి శాశ్వత సభ్య దేశమైన రష్యా ఆ తీర్మానాన్ని వీటో చేసింది.
India abstains, Russia vetoes UNSC resolution: చర్చలే ఉత్తమం
ఈ సందర్భంగా ఐరాసలో భారత ప్రతినిధి రుచిర కాంబోజ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందన్నారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తోందన్నారు.