తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crpf Recruitment: సీఆర్పీఎఫ్ లో 9 వేల కానిస్టేబుల్ పోస్ట్ లకు నోటిఫికేషన్

CRPF recruitment: సీఆర్పీఎఫ్ లో 9 వేల కానిస్టేబుల్ పోస్ట్ లకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

16 March 2023, 16:53 IST

  • CRPF recruitment: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ()లో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాలకు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CRPF Constable Recruitment 2023: భారతీయ పారా మిలటరీ దళాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force CRPF)లో సుమారు 9 వేల కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాలకు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

CRPF recruitment: ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి..

సీఆర్పీఎఫ్ () లో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. మొత్తం 9 వేల కానిస్టేబుల్ పోస్ట్ లను సీఆర్పీఎఫ్ భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27 నుంచి సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ crpf.gov.in. వెబ్ సైట్ ద్వారా ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం crpf.gov.in వెబ్ సైట్ లో సీఆర్పీఎఫ్ అప్ లోడ్ చేసిన నోటిఫికేషన్ ను పరిశీలించండి. మొత్తం టెక్నికల్, ట్రేడ్ మెన్ విభాగాల్లో 9 వేల మందిని ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి మహిళలు కూడా అర్హులే. crpf.gov.in వెబ్ సైట్ ద్వారా మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

CRPF recruitment: ఎగ్జామ్ ఎప్పుడు?

అప్లై చేసుకున్న అభ్యర్థులకు జులై 1 నుంచి 13 తేదీల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూన్ 20 నుంచి అధికారిక వెబ్ సైట్ crpf.gov.inలో అడ్మిట్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు Physical Standards Test (PST), Physical Efficiency Test (PET), Trade Test లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

CRPF recruitment: మొత్తం పోస్ట్ లు 9.212

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇందులో 9, 105 పురుషులకు, 107 మహిళలకు రిజర్వ్ చేశారు. అలాగే, మొత్తం పోస్ట్ లను మళ్లీ రాష్ట్రాల వారీగా విభజించారు. వీరి వేతనం పే లెవెల్ 3 (pay level 3) అనగా, రూ. 21,700 - 69,100 గా ఉంటుంది. విద్యార్హతలు, వయో, పరిమితి తదితర వివరాల కోసం నోటిఫికేషన్ ను పరిశీలించాలి.