తెలుగు న్యూస్  /  National International  /  China Says Covid Outbreak Has Infected 80% Of Population

China Covid news: ‘‘80 శాతం చైనా ప్రజలు ఇప్పటికే కోవిడ్ బారిన పడ్డారు’’

HT Telugu Desk HT Telugu

21 January 2023, 16:10 IST

  • China Covid news: కొరోనా వైరస్ మహమ్మారి బారిన చైనాలో ఇప్పటికే 80% ప్రజలు పడ్డారని సమాచారం. చైనా అధికారిక లెక్కల ప్రకారం జనవరి 12 నాటికి చైనా ఆసుపత్రుల్లో 60 వేల మంది మాత్రమే కోవిడ్ తో చనిపోయారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China Covid news: చైనాలో కోవిడ్ 19 (covid 19) ముప్పు దాదాపు ముగిసినట్లేనని ఆ దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు ప్రకటించారు. ఇప్పటికే దేశంలోని 80% ప్రజలు కొరోనా బారిన పడ్డారని, అందువల్ల మరో వేవ్ కు అవకాశం లేదని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (China Center for Disease Control and Prevention) లో చీఫ్ ఎపిడెమాలజిస్ట్ వు జున్యు వివరించారు. కేసుల సంఖ్యలో, మరణాల్లో భారీ పెరుగుదల నమోదయ్యే స్థితి దాటిపోయామని తెలిపారు. 80% ప్రజలు ఇప్పటికే కోవిడ్ 19 బారిన పడినందువల్ల, వారిలో కొరోనా నిరోధక శక్తి సహజంగానే వచ్చి ఉంటుందని వివరించారు. అందువల్ల, మరో 3, 4 నెలల వరకు కొత్తగా కొరోనా ( వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబో (Weibo) లో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

China Lunar New Year: కొత్త సంవత్సరం వేడుకలు..

చైనా (China)లో చాంద్ర మాన నూతన సంవత్సర (Lunar New Year) వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోట్లాదిగా ప్రజలు సొంత ఊర్లకు ప్రయాణమవుతారు. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ నూతన సంవత్సర (Lunar New Year) వేడుకలకు కచ్చితంగా సొంత ఊరికి చేరుకుంటారు. ఇందుకోసం లక్షల సంఖ్యలో ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల, ఈ సమయంలో కొరోనా వైరస్ (corona virus) వ్యాప్తికి ఎక్కువ అవకాశముందని, కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరిగే ముప్పుందని చైనా వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, కొరోనా (corona) ఔట్ బ్రేక్ కు సంబంధించినంతవరకు పీక్ స్టేజ్ దాటిపోయామని, ఆసుపత్రులు, ఫీవర్ క్లినిక్ లు, ఎమర్జెన్సీ రూమ్ ల్లో కోవిడ్ (COVID) పేషెంట్ల చేరికలు కూడా క్రమంగా తగ్గుతున్నాయని నేషనల్ హెల్త్ కమిషన్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

China Corona news: 60 వేల మంది మృతి

చైనా (China) అధికారిక లెక్కల ప్రకారం, జీరో కోవిడ్ పాలసీ (zero covid policy)ని ఎత్తివేసిన నెల రోజుల్లో జనవరి 12 నాటికి చైనా ఆసుపత్రుల్లో 60 వేల మంది మాత్రమే కోవిడ్ (covid) తో చనిపోయారు. అయితే, ఈ సంఖ్య నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు. ఇళ్లల్లో చనిపోయిన వారి వివరాలు అందులో లేవు. అదీకాకుండా, కోవిడ్ మరణాలుగా నిర్ధారించడానికి సంబంధించి వైద్యులపై కఠిన ఆంక్షలు కూడా విధించారు.