తెలుగు న్యూస్  /  National International  /  Cdc Report Suggests Child Deaths In Gambia Linked To Consumption Of Made-in-india Cough Syrups

Cough syrup deaths: మేడ్ ఇన్ ఇండియా దగ్గు మందుతోనే గాంబియాలో ఆ మరణాలు

HT Telugu Desk HT Telugu

04 March 2023, 20:38 IST

  • Cough syrup deaths: గాంబియా, ఇతర ఆఫ్రికా దేశాల్లో చిన్నారుల మరణాల్లో భారత్ తయారీ దగ్గుమందు పాత్రకు సంబంధించి అమెరికాకు చెందిన సీడీసీ ఒక నివేదిక విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గాంబియా (Gambia)లో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న చిన్న పిల్లల మరణాల వెనుక భారత్ నుంచి దిగుమతి చేసుకున్నఒక దగ్గు మందు (cough syrup) కారణమని అమెరికాకు చెందిన సీడీసీ (Centers for Disease Control and Prevention CDC) తేల్చింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Maiden Pharmaceuticals cough syrup: మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ దగ్గుమందు

భారత్ లో తయారైన దగ్గుమందులకు గాంబియా (Gambia) లో చిన్నారుల మరణాలకు మధ్య సంబంధముందని సీడీసీ అధ్యయనం లో తేలింది. భారత్ లోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ (Maiden Pharmaceuticals Ltd) సంస్థ తయారు చేసిన దగ్గు మందు ను ఔషధంగా తీసుకున్నGambia చిన్నారులు చనిపోయారని సీడీసీ తెలిపింది. మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ (Maiden Pharmaceuticals Ltd) తయారు చేసి గాంబియా (Gambia) కు పంపిన నాలుగు రకాలైన దగ్గు మందులు నాణ్యత పరంగా లోపాలున్నాయని, గాంబియాలో చిన్న పిల్లల మరణాలకు ఆ దగ్గుమందులకు సంబంధం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత అక్టోబర్ లోనే హెచ్చరించింది. అదే విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన సీడీసీ స్పష్టం చేసింది. మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ (Maiden Pharmaceuticals Ltd) తయారు చేసిన దగ్గు మందుల్లో హానికారకమైన Diethylene Glycol [DEG] or Ethylene Glycol [EG] ఉన్నాయని సీడీసీ స్పష్టం చేసింది. వీటివల్ల పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. గాంబియా (Gambia) లో మరణించిన చిన్నపిల్లలు అత్యధికం కిడ్నీ వైఫల్యంతోనే చనిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.

India's response: భారత్ స్పందన

అయితే, మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ (Maiden Pharmaceuticals Ltd) తయారు చేసిన దగ్గు మందులో ఎలాంటి హానికారక కలుషితాలు లేవని, అవి అన్ని నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఫిబ్రవరి 3వ తేదీన లోక్ సభలో ప్రకటన చేయడం గమనార్హం. ఆ దగ్గుమందుల సాంపిల్స్ ను పరీక్షంచినప్పుడు వాటిలో డై ఇథిలీన్ గ్లైకోల్ (Diethylene Glycol DEG) కానీ, ఇథిలీన్ గ్లైకోల్ (Ethylene Glycol EG) కానీ లేవని తేలిందన్నారు.