Banned Cough Syrup in India : ఆ నాలుగు దగ్గు సిరప్‌లపై హెచ్చరిక విడుదల చేసిన WHO.. ఎందుకంటే..
WHO on Cough Syrup : డైథిలిన్ గ్లైకాల్‌తో కూడిన 4 భారతీయ దగ్గు సిరప్‌లపై WHO హెచ్చరిక విడుదల చేసింది. ఎందుకు ఈ దగ్గు సిరప్ ప్రమాదకరమో.. దీనివల్ల పిల్లలకి ఎలాంటి హాని జరుగుతుందో ఇప్పుడు మీరు తెలుసుకుందాం.
WHO on Cough Syrup : పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి హర్యానాలోని సోనెపట్‌లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసిన నాలుగు “కలుషితమైన”, “నాణ్యత లేని” దగ్గు సిరప్‌లు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం హెచ్చరించింది.
“ఈ నాలుగు మందులు భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ద్వారా ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు సిరప్‌లు. డైథలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలుగా ఆమోదయోగ్యం కానీ మొత్తంలో ఉన్నందున వారు పరీక్షలో విఫలమయ్యారు” అని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది.
డైథిలిన్ గ్లైకాల్ అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం?
ఈ దగ్గు సిరప్ తీసుకోవడం వల్ల డజన్ల కొద్దీ అమాయక పిల్లలకు ప్రాణాంతకంగా మారింది. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పిల్లల మరణాలకు రెండు రసాయనాలు కారణమయ్యాయి. డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్. ఈ సమ్మేళనాలు పూర్తిగా రంగులేనివి, వాసన లేనివి. కానీ దగ్గు సిరప్ రుచి తీపి, పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయి.
డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు సిరప్‌లలో రెండు రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నందున.. గాంబియాలో 66 మంది పిల్లల మరణానికి ఇది కారణమని అనుమానిస్తున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కింద నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లోని ఒక పేపర్ ప్రకారం.. ఈ రసాయనాన్ని యాంటీఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్‌లు, సౌందర్య సాధనాలు, లూబ్రికెంట్లలో ఉపయోగిస్తారు. మూత్రపిండ లోపం, వైఫల్యానికి కారణమవుతుంది. కోమా, మరణానికి కూడా దారితీయవచ్చు.
రసాయనం తీపి రుచి, నీటిలో కరగదు. పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తలనొప్పి, మానసిక స్థితి మారడం, తీవ్రమైన మూత్రపిండ గాయాలు వంటి విషపూరిత ప్రభావాలు ఉన్నాయి. NIH పేపర్ గతంలో విష రసాయనం కారణంగా కనీసం 10 సామూహిక విషపూరిత సంఘటనలను ఎత్తి చూపించింది.
భారత జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ అంటే CDSCO కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. CDSCO ప్రాథమిక విచారణలో, వివాదాస్పదమైన మైడెన్ ఫార్మా ఔషధాలను హర్యానా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆమోదించినట్లు కనుగొన్నారు. ఈ మందులు గాంబియాకు మాత్రమే ఎగుమతి అవుతున్నట్లు గుర్తించారు.
సంబంధిత కథనం