Indian cold and cough syrup kills 66: 66 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు-who alert for four indian cold and cough syrups as 66 children die in gambia ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Cold And Cough Syrup Kills 66: 66 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు

Indian cold and cough syrup kills 66: 66 మంది చిన్నారుల ప్రాణం తీసిన దగ్గుమందు

HT Telugu Desk HT Telugu
Oct 06, 2022 03:29 PM IST

Indian cold and cough syrup kills 66: భారత్ లో తయారైన దగ్గుమందు(cough syrup) పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల ప్రాణం పోవడానికి కారణమైంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

<p>హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ఫ్యాక్టరీ</p>
హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ఫ్యాక్టరీ (PTI)

Indian cold and cough syrup kills 66: భారత్ కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన నాలుగు రకాల దగ్గుమందు కారణంగా గాంబియాలో దాదాపు 66 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది.

Indian cold and cough syrup kills 66: మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్..

హరియాణాలోని మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ సంస్థ ఉత్పత్తి చేసిన నాలుగు రకాలు దగ్గు మందులను వాడిన పిల్లలు చనిపోయినట్లు తేలింది. అవి Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup లుగా నిర్ధారించారు. ప్రస్తుతానికి గాంబియాలో వాటి వాడకాన్ని నిలిపేశారు. ఈ కాఫ్ సిరప్ ల్లో ప్రాణాంతక diethylene glycol and ethylene glycol లు ప్రమాదరకర స్థాయిలో ఉన్నాయని నిర్ధారించారు.

Indian cold and cough syrup kills 66: ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్

గాంబియాలో భారతీయ కాఫ్ సిరప్ ను వినియోగించిన చిన్న పిల్లలు చనిపోవడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై స్పందించింది. ఈ విషయమై భారత్ లోని ఔషధ నియంత్రణ సంస్థతో, భారత ప్రభుత్వంతో, ఆ కాఫ్ సిరప్ లను ఉత్పత్తి చేసిన మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ ప్రతినిధులకు తమ ఆందోళనను తెలిపామని WHO వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఆ నాలుగు కాఫ్ సిరప్ లకు సంబంధించి భద్రత ప్రమాణాల వివరాలను మెయిడెన్ ఫార్మాస్యుటికల్స్ WHO కు అందించలేదని ఆ సంస్థ డీజీ టెడ్రోస్ వెల్లడించారు.

Indian cold and cough syrup kills 66: వేరే దేశాల్లోనూ..

వేరే దేశాల్లోనూ ఈ దగ్గు మందు చెలామణిలో ఉండవచ్చని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే, ఈ విషయంలో అన్ని దేశాలను, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలను అప్రమత్తం చేశామన్నారు. వెంటనే వాటిని చెలమణి లో నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలను కోరామన్నారు. ఈ దగ్గుమందులు భద్రతా ప్రమాణాలకు లోబడి లేవని, వీటి వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని సెప్టెంబర్ నెలలోనే WHO కు సమాచారం అందింది.

Whats_app_banner