తెలుగు న్యూస్  /  National International  /  Caller Threatens To Blow Up Reliance Hospital In Mumbai, Issues Threats Against Ambani Family Members; Police Launch Probe

Threat call to Ambani: చంపేస్తామంటూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు

HT Telugu Desk HT Telugu

05 October 2022, 17:04 IST

  • భారత్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ లో బెదరించాడు.

ముకేశ్ అంబానీ
ముకేశ్ అంబానీ

ముకేశ్ అంబానీ

దక్షిణ ముంబైలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు మంగళవారం మధ్యాహ్నం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ హాస్పిటల్ ను పేల్చేస్తానని, ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

పోలీస్ కేసు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఈ ఫోన్ కాల్ వచ్చింది. రిలయన్స్ హాస్పిటల్ ను పేల్చేస్తానని, ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తామని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. దీనిపై ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

గతంలో కూడా..

గతంలో కూడా పలుమార్లు ముకేశ్ అంబానీకి ఇలాంటి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇటీవలనే ప్రభుత్వం కూడా ఆయన భద్రతను జడ్ ప్లస్ కేటగిరీ కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఆగస్ట్ లో ఇలాగే ఈ హాస్పిటల్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్ధాలతో నిండిఉన్న ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పలు అరెస్ట్ లు కూడా చోటు చేసుకున్నాయి.