తెలుగు న్యూస్  /  National International  /  Bus Catches Fire In Pune; Passengers Escape Unhurt

Bus catches fire in Pune: క్షణాల్లో అగ్నికి ఆహుతైన బస్సు

HT Telugu Desk HT Telugu

01 November 2022, 22:25 IST

  • Bus catches fire in Pune: రహదారిపై దూసుకుపోతున్న బస్సు ఇంజిన్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. కొద్ది సేపట్లోనే అవి బస్సంతా వ్యాపించాయి. 

పుణె దగ్గరలో అగ్నికి ఆహుతవుతున్న బస్సు
పుణె దగ్గరలో అగ్నికి ఆహుతవుతున్న బస్సు (PTI)

పుణె దగ్గరలో అగ్నికి ఆహుతవుతున్న బస్సు

Bus catches fire in Pune: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బస్సు మంటలకు ఆహుతయింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రమాదాన్ని గుర్తించిన ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణీకులందరినీ బస్సులో నుంచి సురక్షితంగా దింపేశారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Bus catches fire in Pune: పుణెలో..

పుణె నుంచి యావత్మాల్ వెళ్తున్న బస్సులో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. యరవాడ ప్రాంతంలోని శాస్త్రి చౌక్ వద్ద బస్సుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. మొదట ఇంజిన్ లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే రోడ్డు పక్క బస్సును నిలిపేశాడు. క్షణాల్లో డ్రైవర్, కండక్టర్ కలిసి బస్సులోని 42 మంది ప్రయాణీకులను బస్సులో నుంచి దింపేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే మంటలు బస్సంతా వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ప్రయాణీకులెవరికీ గాయాలు కూడా కాకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు.