WhatsApp calls from smartwatches: వాట్సాప్ కాల్స్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడండి
01 September 2022, 15:27 IST
WhatsApp calls from smartwatches: వాట్సాప్ కాల్స్ ఇకపై స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడొచ్చ తెలుసా. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్2.22.19.11లో అందుబాటులో ఉంది.
WhatsApp calls from smartwatches: వాట్సాప్ కాల్స్ స్మార్ట్ వాచ్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు..
WhatsApp calls from smartwatches: వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తేబోతంది. మీ వాట్సాప్ కాల్స్ ఇకపై ఓఎస్ 3 సాఫ్ట్ వేర్ ఉన్న స్మార్ట్ వాచీ ద్వారా మాట్లాడేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.19.11లో అందుబాటులో ఉంది.
వాట్సాప్ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను బీటావెర్షన్ యూజర్లు రెడిట్‌లో షేర్ చేశారు. వాట్సాప్ నుంచి ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఈ ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్ ఉన్న స్మార్ట్ వాచీల్లో మీకు వాట్సాప్ లోగో కనిపిస్తుంది. తద్వారా అది వాట్సాప్ నుంచి వస్తుందా లేక రెగ్యులర్ మొబైల్ కాల్ అనేది తెలుస్తుంది. ఆ కాల్ స్వీకరించేందుకు లేదా తిరస్కరించేందుకు ఆప్షన్ ఉంటుంది.
కొత్త వాట్సాప్ ఫీచర్ ఎవరెవరికి పనిచేస్తుంది?
ప్రస్తుతం ఈ వాట్సాప్ ఫీచర్ ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్ ఉన్న స్మార్ట్ వాచీల్లో మాత్రమే పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4, వాచ్ 5 తదితర స్మార్ట్ వాచీ యూజర్లకు ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే గెలాక్సీ 5 వాీ గూగుల్ పిక్సెల్ 6తో పెయిర్ చేసినప్పుడు వాట్సాప్ ఇన్‌కమింగ్ కాల్‌లో లోగో కనిపించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నందున ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఈ అప్ డేట్ ప్రవేశపెట్టవచ్చు. క్రమంగా అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.