తెలుగు న్యూస్  /  National International  /  Airfare Caps To Be Removed From August 31

Airfare: విమాన టిక్కెట్లపై కనిష్ట గరిష్ట పరిమితుల తొలగింపు..

HT Telugu Desk HT Telugu

10 August 2022, 17:41 IST

    • Airfare: కరోనావైరస్ మహమ్మారి సమయంలో 2020లో విమానయాన సంస్థలపై విధించిన విమాన ఛార్జీల పరిమితులను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆగస్టు 31 నుంచి విమాన టికెట్ ధరల పరిమితిపై తొలగనున్న ఆంక్షలు
ఆగస్టు 31 నుంచి విమాన టికెట్ ధరల పరిమితిపై తొలగనున్న ఆంక్షలు (HT_PRINT)

ఆగస్టు 31 నుంచి విమాన టికెట్ ధరల పరిమితిపై తొలగనున్న ఆంక్షలు

కరోనావైరస్ మహమ్మారి సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో 2020లో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన విమాన ఛార్జీల పరిమితులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

ఆగస్ట్ 31 నుంచి విమాన ఛార్జీల పరిమితులను తొలగిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. టిక్కెట్ ధరలపై ఆంక్షలను ఎత్తివేసింది.

రోజువారీ డిమాండ్, ఏటీఎఫ్ ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత విమాన ఛార్జీల పరిమితులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన మంత్రి తెలిపారు.

విమాన ప్రయాణంపై 2020లో ఆంక్షల సడలింపు కారణంగా ఉత్పన్నమయ్యే డిమాండ్ నేపథ్యంలో టికెట్ ధరలు పెరగకుండా నిరోధించడానికి విమాన ప్రయాణ సమయం ఆధారంగా కనిష్ట, గరిష్ట ఛార్జీలకు విధించడం ద్వారా ప్రభుత్వం ఛార్జీలను నియంత్రించింది.

కేంద్ర తాజా నిర్ణయంతో ఇక విమానయాన సంస్థలు మునుపటి తరహాలో డిమాండ్‌ను అనుసరించి టికెట్ ధరలను పెంచుకోవచ్చు. డిమాండ్ లేనప్పుడు తగ్గించుకోవచ్చు.

టాపిక్