తెలుగు న్యూస్  /  National International  /  Aai Non Executive Recruitment 2022 Apply For 53 Sr Assistant Posts At Aai Aero

AAI Non-Executive Recruitment 2022: ఏఏఐ‌లో 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు..

HT Telugu Desk HT Telugu

23 December 2022, 8:49 IST

  • AAI Non-Executive Recruitment 2022: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

AAI Non Executive Recruitment 2022: ఏఏఐ నుంచి 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AAI Non Executive Recruitment 2022: ఏఏఐ నుంచి 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Shutterstock/ Representative photo)

AAI Non Executive Recruitment 2022: ఏఏఐ నుంచి 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏఏఐ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

రిజిస్ట్రేషన్ ఈనెల 21న ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 20, 2023గా నిర్దేశించారు. ఖాళీల వివరాలు, అర్హతలు మీకోసం..

Vacancy Details: ఖాళీల వివరాలు

  • సీనియర్ అసిస్టెంట్( అధికార భాష): 5 posts
  • సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్): 16 posts
  • సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 32 posts

Eligibility Criteria: అర్హతలు

అభ్యర్థులు విద్యార్హతలను ఏఏఐ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్దేశించిన సమగ్ర నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఆయా పోస్టులకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు.

Selection Process: ఎంపిక ప్రక్రియ

ఏఏఐ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందుకోసం అడ్మిట్ కార్డు జారీచేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను వడపోసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షకు పిలుస్తారు.

Application Fees: దరఖాస్తు రుసుము

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1000
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఏఏఐలో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు రుసుము లేదు.

ఏఏఐ నోటిఫికేషన్ సమగ్ర వివరాల కోసం ఈ కిందఇచ్చిన పీడీఎఫ్‌లో నోటిఫికేషన్ చూడండి.