తెలుగు న్యూస్  /  National International  /  9 Indians Among 10 Killed In Maldives Fire

Maldives Fire : మాల్దీవుల్లో అగ్నిప్రమాదం.. 8 మంది భారతీయులు మృతి!

10 November 2022, 12:53 IST

    • Maldives Fire: మాల్దీవుల రాజధాని మాలేలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది భారతీయులు మృతి చెందినట్టు తెలుస్తోంది.
మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం
మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం (AFP)

మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం

Maldives Fire: మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మాల్దీవుల రాజధాని నగరం మాలే (Maldives Capital Male) లోని ఓ బిల్డింగ్‍లో భారీగా మంటలు చెలరేగాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వర్కర్స్ ఉంటున్న ఓ భవనంలో ప్రమాదం జరిగిందని మాల్దీవుల అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారని ప్రకటించారు. బిల్డింగ్‍లోని పై అంతస్తు నుంచి మృతదేహాలను బయటికి తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది గాయాలపాలయ్యారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించామని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. నాలుగు గంటల పాటు శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు.

Maldives Fire: 8 మంది భారతీయులు మృతి!

మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని, మరొకరు బంగ్లాదేశ్‍కు చెందిన వారని ఓ సెక్యూరిటీ అధికారి వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా లేదు. ఈ ఘటనపై మాల్డీవుల్లోని భారత హై కమిషన్ (Indian High commission in Maldives) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేల్‍ అగ్నిప్రమాద ఘటన మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వివరాల కోసం మాల్దీవుల అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొంది. హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది.

Maldives Male’s Fire Accident: గ్యారేజ్ ఉన్న భవనంలో..

కింది అంతస్తులో వాహనాల రిపేర్ గ్యారేజ్ ఉన్న భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఘటనకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.