తెలుగు న్యూస్  /  National International  /  5g Spectrum Auction Stretches To 4th Day; Bids Worth <Span Class='webrupee'>₹</span>1,49,623 Crore Received So Far

5G auction ; కొన‌సాగుతున్న‌ 5జీ వేలం

HT Telugu Desk HT Telugu

28 July 2022, 23:34 IST

  • 5G auction : వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ అందించే ఫిఫ్త్ జ‌న‌రేష‌న్‌(5జీ) స్పెక్ట్ర‌మ్ వేలం కొన‌సాగుతోంది. వ‌రుస‌గా మూడో రోజైన గురువారం కూడా టెలీకాం సంస్థ‌లు 5జీ వేలం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

5G auction : టెలికాం సంస్థ‌లు నాలుగో రోజు నాటికి రూ. 1.5 లక్ష‌ల కోట్ల విలువైన బిడ్ల‌ను దాఖ‌లు చేశాయి. స్పెక్ట్రం వేలం పూర్తి కానందున ఈ 5జీ ఆక్ష‌న్ నాలుగో రోజైన శుక్ర‌వారం కూడా కొన‌సాగ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

5G auction : 1.5 ల‌క్ష‌ల కోట్లు

భార‌త్‌లో 5జీ సేవ‌లు ప్రారంభం కావ‌డానికి రంగం సిద్ధ‌మైంది. వివిధ బ్యాండ్‌విడ్త్‌ల‌లో 5జీ స్పెక్ట్రంను విక్ర‌యించ‌డానికి కేంద్రం టెల్కోల నుంచి బిడ్ల‌ను ఆహ్వానించింది. ఈ వేలం ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. గ‌త నాలుగు రోజుల్లో టెలీకాం సంస్థ‌ల నుంచి రూ. 1,49,623 కోట్ల విలువైన బిడ్స్ వ‌చ్చాయి. గురువారం మూడోరోజు వేలం ముగిసే స‌మ‌యానికి మొత్తంగా 16 రౌండ్ల ఆక్ష‌న్ జ‌రిగింది. బుధ‌వారం ఆక్ష‌న్ ముగిసే స‌మ‌యానికి రూ. 1,49,454 కోట్ల విలువైన బిడ్స్ దాఖ‌ల‌య్యాయి.

5G auction : ప్ర‌ధానంగా 4 సంస్థ‌లు

5 జీ వేలంలో ప్ర‌ధానంగా నాలుగు సంస్థ‌లు పాల్గొంటున్నాయి. అవి రిల‌య‌న్స్ జియో, వీ(వొడాఫోన్ ఐడియా), ఎయిర్‌టెల్‌, కొత్త‌గా వ‌చ్చిన ఆదానీ డేటా నెట్‌వ‌ర్క్స్ ఈ వేలంలో క్రియాశీల‌కంగా పాల్గొంటున్నాయి. మూడో రోజు ముగిసే స‌మ‌యానికి 16 రౌండ్ల బిడ్డింగ్ ముగిసింద‌ని, ఆక్ష‌న్ శుక్ర‌వారం కూడా కొన‌సాగుతుంద‌ని టెలీకాం శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల‌కు కూడా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను తీసుకువెళ్లే విధంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు.

5G auction : 1800 MHz పై ఆస‌క్తి

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఈస్ట్ స‌ర్కిల్‌లో 1800 MHz బ్యాండ్ విడ్త్ పై బిడ్డ‌ర్ల‌లో ఎక్కువ ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. ఇక్క‌డ ఎయిర్‌టెల్‌, జియో పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. ప్ర‌స్తుత 5జీ వేలంలో రూ. 4.3 ల‌క్ష‌ల కోట్ల ఆఫ‌ర్ ధ‌ర‌తో 72 GHz (Gigahertz) రేడియో వేవ్స్‌ను ప్ర‌భుత్వం వేలానికి పెట్టింది. ప్ర‌స్తుతం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz ఫ్రీక్వెన్సీల కోసం వేలం జ‌రుగుతోంది. 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే ప్ర‌స్తుత 4జీ స్పీడ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇంట‌ర్నెట్ సేవ‌లు ల‌భిస్తాయి.