తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Drunk N Drive Case: మద్యం తాగి నడిపితే.. ఐదుగురి ప్రాణాలు పోయాయి..

Drunk n drive case: మద్యం తాగి నడిపితే.. ఐదుగురి ప్రాణాలు పోయాయి..

HT Telugu Desk HT Telugu

02 November 2022, 11:39 IST

    • Drunk n drive case: మద్యం తాగి బస్సు నడపడంతో హైవేపై అది వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురి ప్రాణాలు పోయాయి.
డ్రైవర్ మద్యం తాగి నడపడంతో అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టిన బస్సు
డ్రైవర్ మద్యం తాగి నడపడంతో అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టిన బస్సు (HT_PRINT)

డ్రైవర్ మద్యం తాగి నడపడంతో అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టిన బస్సు

అలీఘర్ (యూపీ): హైవేపై ప్రైవేట్ బస్సు అనేక వాహనాలను ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో అర డజనుకు పైగా గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

ఈ సంఘటన మంగళవారం రాత్రి జట్టారి-తప్పల్ టౌన్‌షిప్ మధ్య ప్రాంతంలో జరిగినట్లు వారు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పంజాబ్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి కార్లు, టెంపోలు, ద్విచక్ర వాహనాలతో సహా డజను వాహనాలను ఢీకొట్టింది.

పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో ఉన్న బస్సు డ్రైవర్ రోడ్డుపై ఆగి ఉన్న టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించామని, వారు నిలకడగా ఉన్నారని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.