తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  2023 Elections In India : 2023లో ఎన్నికల జాతర- 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​!

2023 elections in India : 2023లో ఎన్నికల జాతర- 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​!

31 December 2022, 11:14 IST

google News
    • Elections in India 2023 : 2022లో జరిగిన హైఓల్టేజ్​ ఎన్నికలు వార్తల్లో నిలిచాయి. ఇక అంతకుమించిన యాక్షన్​కు 2023 సిద్ధమవుతోంది! వచ్చే ఏడాది దేశంలో ఎన్నికల జాతర ఉండనుంది! వీటిని 2024 లోక్​సభ ఎననికలకు సెమీ ఫైనల్​గా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. మరి వీటిల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? 2024 సార్వత్రికాని ఏ పార్టీ ఎలాంటి పరిస్థితుల మధ్య అడుగుపెడుతుంది?
2023లో ఎన్నికల జాతర- 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​!
2023లో ఎన్నికల జాతర- 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​!

2023లో ఎన్నికల జాతర- 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​!

2023 elections in India : 2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్​గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి.

రాజస్థాన్​లో హోరాహోరీ..

రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్​లో కూడా వచ్చే ఏడాదే ఎన్నికలు జరగొచ్చు. ఇవన్నీ చూస్తుంటే.. 2024 సార్వత్రిక ఎన్నికలకు.. 2023 ఎన్నికలు సెమీఫైనల్​గా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2023 Rajasthan elections : ఈ 9 రాష్ట్రాల్లో.. రాజస్థాన్​, ఛత్తీస్​గఢలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంది. ఇటీవలే ముగిసిన హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల విజయంతో.. ఈ రెండు రాష్ట్రాలోని కాంగ్రెస్​ శ్రేణులు నూతన ఉత్సాహంతో బరిలో దిగుతారనడంలో సందేహం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటే.. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాల్ని ఇస్తున్నట్టు పరిగణించవచ్చు!

2018 రాజస్థాన్​ ఎన్నికల్లో బీజేపీని ఓడించి.. అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్​. 200 సీట్ల అసెంబ్లీలో 100 స్థానాలను దక్కించుకుంది. 2013లో 163 సీట్లతో ఘన విజయం సాధించిన కమలదళం.. 2018కి వచ్చేసరికి 73సీట్లకే పరితమైంది. 2023లో రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు తథ్యం! 1990 నుంచి ఇక్కడ.. అధికారం ఈ రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ వస్తోంది.

Rajasthan Assembly elections 2023 : వాస్తవానికి.. కాంగ్రెస్​కు బీజేపీతో వచ్చే ఇబ్బందులు కన్నా సొంత పార్టీలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి! ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ మధ్య వివాదం, మాటల యుద్ధం నిత్యం వార్తల్లో నిలుస్తూ.. హైకమాండ్​కు తలనొప్పి తెప్పిస్తుంటాయి.

ఇక 90 అసెంబ్లీ సీట్లున్న ఛత్తీస్​గఢ్​కు 2018లో ఎన్నికలు జరగ్గా.. 68 స్థానాల్లో గెలిచి విజయఢంకా మోగించింది కాంగ్రెస్​. ఫలితంగా.. 15ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 15 సీట్లే దక్కడం గమనార్హం. ఇటీవలే జరిగిన భానుప్రతాపూర్​ ఉప ఎన్నికలోనూ విజయం.. కాంగ్రెస్​నే వరించింది.

Madhya Pradesh Assembly elections 2023 : ఇక్కడ మధ్యప్రదేశ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2018 ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ హైడ్రామాతో కూడిన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి.. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచింది. 15ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ.. కమల్​నాథ్​ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ సందడి ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లకే పార్టీపై తిరుగుబాటు చేశారు జ్యోతిరాదిత్య సింథియ. పార్టీపై తీవ్ర అసంతృప్తితో.. బీజేపీలో చేరారు. ఆయనతో పాటు 22 సిట్టింగ్​ ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోయారు. ఫలితంగా కమల్​నాథ్​ ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. మరోమారు సీఎంగా ప్రమాణం చేశారు. జ్యోతిరాదిత్య సింథియ.. కేంద్రమంత్రి అయ్యారు.

కర్ణాటకలో అయితే.. ఎన్నికల హై డ్రామా పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీలు ఆడిన రాజకీయ చదరంగం ఆట.. ఉత్కంఠను రేకేత్తించింది. 2018ఎన్నికల్లో వాస్తవానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. అయినప్పటికీ.. సీఎంగా ప్రమాణం చేశారు బీజేపీ నేత బీఎస్​ యడియూరప్ప. కానీ ఆయన ప్రభుత్వం నిలవలేదు. బలపరీక్షకు ముందే ఆయన రాజీనామా చేసేశారు. అనంతరం.. జేడీఎస్​తో కలిసి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్​ నేత హెచ్​డీ కుమారస్వామి.. సీఎం అయ్యారు.

2023 Karnataka Assembly elections : కానీ సరిగ్గా 14 నెలలకు ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. 10కిపైగా మంది ఎమ్మెల్యేలు.. రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం నిలబడలేదు. ఫలితంగా 2019లో మళ్లీ సీఎం అయ్యారు బీఎస్​ యడియూరప్ప. కానీ 2021లో ఆ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తూ.. బసవరాజ్​ బొమ్మైని ముఖ్యమంత్రి చేసింది హైకమాండ్​.

తెలంగాణలో నువ్వా- నేనా..

2023లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ పోరు అత్యంత సరవత్తరంగా ఉండనుంది! 9 అసెంబ్లీ ఎన్నికలను పోల్చి చూస్తే.. బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రంపైనే అధిక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. 2014లో తెలంగాణ ఏర్పడగా.. అప్పటి నుంచి కేసీఆర్​ నేతృత్వంలోని టీఆర్​ఎస్ పార్టీ​ రాష్ట్రాన్ని పాలిస్తోంది. 2018 ఎన్నికల్లోనూ మంచి విజయాన్నే అందుకుంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ అనూహ్యంగా బలపడి.. టీఆర్​ఎస్​కు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. ఇదంతా అతి తక్కువ సమయంలోనే జరగడం విశేషం. ఇక్కడ అధికారాన్ని చేపట్టాలని కమలదళం కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

Telangana Assembly elections 2023 : మరోవైపు.. కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్​.. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్​ రాష్ట్ర సమితిగా మార్చి.. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కేసీఆర్​కు కూడా అత్యంత కీలకమే!

ఈశాన్య భారతంలో..

2018 త్రిపుర అసెంబ్లీ(60సీట్లు) ఎన్నికల్లో.. బీజేపీ విజయం సాధించింది. 35మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా.. మానిక్​ సాహా స్థానంలో బిప్లవ్​ దేవ్​ను సీఎం చేసింది కమలదళం. ఇక్కడ టీఎంసీ నుంచి బీజేపీ గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ రెండు పార్టీల మధ్య హైటెన్షన్​ వార్​ నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.

2024 Loksabha elections : 2018లో మేఘాలయకు ఎన్నికలు జరగ్గా.. అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్​. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఇది బీజేపీకి కలిసి వచ్చింది. వెంటనే పావులు కదిపి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రెండు సీట్లే వచ్చినప్పటికీ.. ఎన్​పీపీ(నేషనల్​ పీపుల్స్​ పార్టీ)తో మైత్రిని ఏర్పరచుకుని అధికారం చేపట్టింది. అయితే ఈసారి సొంతంగా ఎన్నికల్లోకి వెళతామని ఎన్​పీపీ ప్రకటించడం గమనార్హం.

నాగాలాండ్​లో ఎన్​డీపీపీ(నేషనల్​ డెమొక్రటిక్​ ప్రొగ్రెసివ్​ పార్టీ)తో కలిసి 2018 ఎన్నికల్లో బరిలో దిగింది బీజేపీ. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మిజోరాంలో.. మీజో నేషనల్​ ఫ్రెంట్​ అధికారంలో ఉంది. ఇక్కడ జోరంథంగ సీఎంగా ఉన్నారు. 40 సీట్ల అసెంబ్లీలో 2018లో 226 సీట్లు దక్కించుకుంది ఎమ్​ఎన్​ఎఫ్​. చరిత్రలో తొలిసారిగా.. ఇక్కడ బీజేపీ ఖాతా తెరిచింది.

తదుపరి వ్యాసం