తెలుగు న్యూస్  /  National International  /  16 Year Old Girl Gang Raped For Over 12 Hours In Maharashtra Palghar 8 Arrested

Gang Rape in Maharashtra: దారుణం.. 16 ఏళ్ల బాలికపై 12 గంటలకుపైగా అత్యాచారం.. 8 మంది అరెస్ట్

18 December 2022, 20:16 IST

    • Gang Rape in Maharashtra: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక 12 గంటలకు పైగా గ్యాంగ్ రేప్‍నకు గురైంది. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape in Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. 12 గంటలకు పైగా నరకయాతన అనుభవించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ పాశవిక ఘటన జరిగింది. గత శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం మధ్య ఈ ఘాతుకం జరిగింది. 8 మంది నిందితులు ఆ బాలికను ఎత్తుకెళ్లి ఖాళీగా ఉన్న ఓ భవనంలో 12 గంటలకు పైగా రేప్‍ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Gang Rape in Maharashtra: “డిసెంబర్ 16వ తేదీ రాత్రి 8 గంటలకు మొదలైన ఈ దారుణం తర్వాతి రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగిందని.. ఫిర్యాదులో ఆ బాలిక చెప్పింది” అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ తర్వాత ఆ బాలికను సముద్ర తీరంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆ దుండగులు మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పల్ఘార్ జిల్లాలోని సత్పతి పోలీస్ స్టేషన్‍లో ఈ గ్యాంగ్ రేప్ కేసు నమోదైనట్టు పాల్ఘర్ రూరల్ పోలీస్ స్టేషన్‍కు చెందిన ఓ అధికారి తెలిపారు. పోక్సో, గ్యాంగ్ రేప్ సహా మొత్తం ఆరు ఐపీసీ సెక్షన్ల కింద ఆ 8 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

కోల్‍కతాలో..

కోల్‍కతాలోనూ ఓ పాశవిక ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలిక రేప్ కేసులో 18 ఏళ్ల యువకుడిని, అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను ఇంటికి పిలిచి ఆ మహిళ మత్తుమందు ఇచ్చింది. అనంతరం ఆ మహిళ కుమారుడు మూడు రోజుల పాటు ఆ బాలికపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక ఆ ఇంట్లో నుంచి తప్పించుకొని, తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. అక్టోబర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రేప్ కేసులో ఆ మహిళను, యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ఆ ఇద్దరిని పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు డిసెంబర్ 23 వరకు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం.