తెలుగు న్యూస్  /  National International  /  16 Jawans Killed As Army Truck Falls Into Gorge In Sikkim; 'Pained',: Rajnath

16 jawans killed: 16 మంది సైనికుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu

23 December 2022, 16:43 IST

  • 16 jawans killed in Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర సిక్కింలో ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయిన ఘటనలో 16 మంది భారతీయ జవాన్లు దుర్మరణం పాలయ్యారు.

సిక్కింలో ప్రమాదం జరిగిన ప్రదేశం
సిక్కింలో ప్రమాదం జరిగిన ప్రదేశం

సిక్కింలో ప్రమాదం జరిగిన ప్రదేశం

16 jawans killed in Sikkim: ఉత్తర సిక్కింలోని ఒక ప్రమాదకర మలుపు 16 మంది సాహస జవాన్ల ప్రాణాలు తీసింది. జెమా ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న ప్రమాదకర మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రక్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

16 jawans killed in a road accident in Sikkim: ముగ్గురు జేసీఓలు కూడా..

సిక్కింలోని చట్టెన్ నుంచి తంగు వైపు ఆర్మీ జవాన్లతో శుక్రవారం ఉదయం మూడు ట్రక్ లు బయల్దేరాయి. అవి జెమా ప్రాంతంలోకి చేరుకున్న సమయంలో.. అక్కడ ఉన్న ఒక ప్రమాదకర మలుపు నుంచి వెళ్తున్న క్రమంలో.. ఒక వాహనం రోడ్డు ప్రక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు జవాన్లను చాపర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Defence minister condolences: రాజ్ నాథ్ ఆవేదన

ఈ ఘోర ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో భారతీయ జవాన్ల ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దేశానికి వారు అందించిన సేవలకు, వారి ధైర్య సాహసాలకు దేశ ప్రజలు వారికి ఎన్నటికీ రుణపడి ఉంటారు. ఈ ప్రమాదంలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.

టాపిక్