తెలుగు న్యూస్  /  National International  /  14-foot Burmese Python Weighing Over 55 Kg Rescued In Assam's Nagaon

Giant Python | 14 అడుగులు.. 55 కేజీలు.. ఈ కొండ చిలువ‌ను చూశారా..!

HT Telugu Desk HT Telugu

08 July 2022, 22:13 IST

    • Giant Python : మామూలు పాముల‌ను చూస్తేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. ఆన‌కొండ‌ల‌ను స్క్రీన్‌పై మాత్ర‌మే చూడ‌గ‌లం. అయితే, అలాంటి ఆన‌కొండ వంటి కొండ‌చిలువ‌ను అస్సాంలో ప‌ట్టుకున్నారు. ఆ కొండ చిలువ 14 అడుగుల పొడ‌వు ఉంది. అంటే స‌గ‌టు మ‌నిషి ఎత్తుకు దాదాపు మూడింతలు.
14 అడుగుల‌ కొండ చిలువ
14 అడుగుల‌ కొండ చిలువ

14 అడుగుల‌ కొండ చిలువ

Giant Python : అస్సాంలోని నాగోన్ జిల్లాలోని కాలియ‌బోర్‌ ప్రాంతంలో ఒక భారీ కొండ‌చిలువ‌ను అధికారులు ర‌క్షించారు. స్థానికంగా ఉన్న సొనారీ టీ ఎస్టేట్‌లోని కాలువ‌లో ఈ భారీ చిలువ‌ను అక్క‌డి కూలీలు మొద‌ట చూశారు. భ‌య‌భ్రాంతుల‌కు లోనై, వెంట‌నే అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు వ‌చ్చి దాన్ని ర‌క్షించారు. అనంత‌రం ద‌గ్గ‌ర‌లోని సిల్‌ఘాట్ కామాఖ్య రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో ఆ భారీ చిలువ‌ను వ‌దిలేశారు. ఈ భారీ కొండ‌చిలువ‌ను పెద్ద పెద్ద‌ పాముల‌ను పట్టుకోవ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్ అయిన సంజిబ్ దేకా సాయంతో అధికారులు బంధించ‌గ‌లిగారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Giant Python : బ‌ర్మా పైథాన్‌

ఈ పామును బ‌ర్మా పైథాన్‌గా గుర్తించారు. ఇది 14 అడుగుల‌కు పైగా పొడ‌వుంది. 55 కేజీల క‌న్నా ఎక్కువ బ‌రువుంది. `నా జీవితంలో ఇంత పెద్ద పామును చూడ‌డం ఇదే ప్ర‌థ‌మం` అని సంజిబ్ దేకా వెల్ల‌డించారు. టీ ఎస్టేట్‌లో పురుగుమందు చ‌ల్లుతున్న కూలీలు మొద‌ట దీన్ని చూసి స‌మాచార‌మిచ్చార‌ని, ఆ స‌మ‌యంలో అది అక్క‌డి ఒక కాలువ‌లో చిక్కుకుపోయి ఉంద‌ని వివ‌రించారు. ప్ర‌పంచంలో భారీ సైజ్ పాము జాతుల్లో బ‌ర్మా పైథాన్ జాతి ఒక‌టి. ఈ పాములు 25 అడుగుల పొడ‌వు వ‌ర‌కు పెరుగుతాయి. 140 కేజీల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి.