తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why Is The Camera On The Left Side Of The Smartphone? Know The Interesting Reason

Mobile Camera Fact: మొబైల్‌లో ఎడమవైపు కెమెరా ఎందుకు ఉంటుందో తెలుసా?

HT Telugu Desk HT Telugu

13 August 2022, 21:33 IST

    • కెమెరా ఎడమవైపు ఉండడానికి కారణం మొబైల్ డిజైన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ప్రధాన కారణం కాదు కానీ మరో కారణం కూడా ఉంది. దాని గురించి మరింత తెలుసుకుందాం.
Mobile Camera Fact
Mobile Camera Fact

Mobile Camera Fact

స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో ఫోన్‌లు కొత్త కొత్త అప్‌డేట్స్‌తో వస్తున్నాయి. ఇంతకుముందు కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించే మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. చాలా పనులను మొబైల్ ద్వారా చక్కబెడుతున్నారు. దీనితో పాటు మొబైల్ విసృత వినోద సాధనంగా మారింది. అయితే అప్‌డెట్స్‌తో వస్తున్న ఫోన్‌లో చాలా మార్పులు చూస్తుంటాం. కానీ చాలా స్మార్ట్‌ఫోన్‌‌లలో‌ కెమెరా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఎడమ వైపున ఉన్నట్లు మీరు గమనిచ్చవచ్చు. చాలా మొబైల్ ఫోన్‌లలో ఎడమవైపు మాత్రమే కెమెరా ఉంటుంది. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసా? దీని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పడు తెలుసుకుందాం...

ట్రెండింగ్ వార్తలు

Covishield vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వస్తున్న అరుదైన ప్రాణాంతక సమస్య టిటిఎస్, ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

World Tuna Day 2024: టూనా చేప రోజూ తింటే బరువు తగ్గడంతో పాటూ గుండెపోటునూ అడ్డుకోవచ్చు

Korrala laddu: కొర్రల లడ్డు ఇలా చేసి దాచుకోండి, రోజుకి ఒక్కటి తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం

Vampire Facial: వాంపైర్ ఫేషియల్ చేయించుకుంటే HIV సోకింది జాగ్రత్త, అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం

ఎడమవైపు కెమెరా ఉండానికి కారణం

కెమెరా ఎడమవైపు ఉండడానికి కారణం మొబైల్ డిజైన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ప్రధాన కారణం కాదు. దానికి మరో కారణం కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం, చాలా మంది ప్రజలు ఎడమ చేతితో మొబైల్‌ను ఉపయోగిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, ఎడమ వైపు కెమెరా ఉండడం వల్ల ఫోటోలు లేదా వీడియోలను షూట్ చేయడం సులభం అవుతుంది. అలాగే, కెమెరాను ల్యాండ్‌స్కేప్‌గా ఉపయోగించినప్పుడు. మొబైల్ కెమెరా పైకి ఎదురుగా ఉంటుంది, దీంతో మనం సులభంగా ల్యాండ్‌స్కేప్ ఫోటోలను తీయవచ్చు. దీని కోసమే, కెమెరాను మొబైల్ ఫోన్‌లో ఎడమ వైపున అమర్చారు.

సెల్ఫీ కెమెరా మిర్రర్ ప్రభావం

అలాగే మొబైల్ వినియోగదారులు ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ తీసుకుంటే ఫోటో రివర్స్ అవుతుంది. అంటే, దాని స్థానం ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు మారుతుంది. అందుకే సెల్ఫీలో రాసుకున్న పేరు తిరగబడుతుంది. చాలా మొబైల్స్‌లో ఈ సమస్య ఉంటుంది. మొబైల్స్‌లోని సెల్ఫీ కెమెరా మిర్రర్ ఎఫెక్ట్‌ని కలిగి ఉంటుంది. ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే కెమెరాలో సూటిగా కనిపించినా, ఫోటో తీసిన తర్వాత తలకిందులుగా కనిపించడానికి కారణం ఇదే

ఇంతకుముందు కెమెరా మధ్యలో ఉండేది -

మొదట్లో స్మార్ట్‌ఫోన్ మధ్యలో కెమెరాలను ఉంచారు, కానీ క్రమంగా ఈ కెమెరాలు మొబైల్‌కు ఎడమ వైపుకు రావడం ప్రారంభించాయి. ఇది మొదట ఐఫోన్‌తో ప్రారంభించబడింది. దీని తరువాత, చాలా కంపెనీలు సైడ్ కెమెరాలను అందించడం ప్రారంభించాయి.