తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vastu Shastra Tips For Your New Home And Attached Bathroom And Toilet

Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను బాత్‌రూమ్‌లో ఉంచకూడదు!

HT Telugu Desk HT Telugu

23 July 2022, 15:37 IST

    • Vastu Tips:  వాస్తుకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ  అవసరం. లేకపోతే జీవితంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
Vastu Tips in bathroom
Vastu Tips in bathroom

Vastu Tips in bathroom

హిందు సంప్రాదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చిన్న చిన్న విషయాలలో చేసే నిర్లక్ష్యం వల్ల ఇంటికి వాస్తు దోషం పడుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. దోషాలు కుటుంబ సభ్యుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాటిలో సరైన దిశలో ఉంచకపోవడం వల్ల వ్యక్తుల జీవితంలో కష్టాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆదాయం తగ్గుతుందని, కష్టాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల వాస్తుకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం .

ముఖ్యంగా ఇంట్లో బాత్రూమ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, మీరు కొన్ని చిన్న తప్పులను నివారించాలి. ఇది చంద్రుని స్థానం. తప్పుడు వస్తువులను అక్కడ ఉంచడం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. అయితే బాత్‌రూమ్‌లో ఏ వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మెుక్కలు ఉంచవద్దు

బాత్రూమ్ ఆహ్లాదకరంగా ఉండటానికి, బాత్రూమ్ అందంగా కనిపించడానికి చాలా మంది బాత్రూమ్‌ను మొక్కలతో అలంకరిస్తారు. అయితే ఇక్కడ ఎలాంటి మొక్కలు నాటకూడదు. వాస్తు శాస్త్ర నిపుణుడిని సంప్రదించిన తర్వాతనే మెుక్కలను ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవాలి.

మురికి నీటితో ఉండే బకెట్

బాత్రూమ్‌లలో ఎప్పుడు మురికి నీటితో కూడిన బకెట్‌ను ఉంచకూడదు. స్నానం చేసిన తర్వాత లేదా బట్టలు ఉతికిన తర్వాత బకెట్‌లలో ఉండే నీటిని బయట పారబోయాలి

చెప్పులు వేసుకోవద్దు

బాత్రూంలో ఎప్పుడు చెప్పులను ఉంచకూడదు.

టాయిలెట్ సీటు

ఇప్పుడు ఎక్కువ మంది మోడరన్ బాత్‌రూంలను నిర్మిస్తున్నారు. టాయిలెట్ అటాచ్‌‌మెంట్‌తో వస్తాయి. అంటే బాత్రూంలో టాయిలెట్ సీట్ ఉంచడం వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. ఇది చంద్రుడు, రాహువుల కలయికగా పరిగణించబడుతుంది. ఇది రాహువు, శని దోషాన్ని సృష్టిస్తుంది.

తడి బట్టలు

బాత్రూంలో ఎక్కువసేపు తడి బట్టలు ఉంచకూడదు. దీని వల్ల సూర్య దోషం వస్తుంది.

విరిగిన జుట్టు

స్నానం చేసిన తర్వాత, బాత్రూంలో జుట్టు పేరుకుపోతుంది. కొంతమంది చాలా రోజులు అలానే ఉంచుతారు. కానీ వెంటనే శుభ్రం చేయాలి. రాలిపోయిన వెంట్రుకలను అక్కడే ఉంచడం వల్ల సూర్య దోషం వస్తుంది.

విరిగిన కుళాయి లేదా షవర్

చాలా మంది బాత్రూంలలో నీరు కారుతున్న కుళాయి లేదా షవర్ ఉంటుంది. అటువంటి కుళాయిలను వెంటనే మార్చాలి. ఇది వాస్తుకు అనుకూలం కాదు.

తుడుచే గుడ్డ

బాత్రూంలో తుడిచే గుడ్డులను ఉంచవద్దు. చీపురు కూడా ఉంచవద్దు. ఇది అశుభం.

పగిలిన అద్దం

బాత్రూంలో ఉండే అద్దం పగలకూడదు. అద్దం పగిలితే వెంటనే మార్చాలి. దీనిని బాత్రూంలో ఉంచడం అశుభం.

టాపిక్