తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Drink For Weight Loss : బరువు తగ్గాలనుకుంటే.. 15 రోజులు ఈ డ్రింక్ తాగండి

Morning Drink for Weight Loss : బరువు తగ్గాలనుకుంటే.. 15 రోజులు ఈ డ్రింక్ తాగండి

10 September 2022, 10:36 IST

google News
    • Turmeric Tea For Weight Loss : వచ్చేవన్నీ పండుగలే. ఈ సమయంలో బరువు పెరిగి డ్రెస్​లు ఫిట్​ అవ్వట్లేదని బాధపడుతున్నారా? అయితే 15 రోజులు పసుపు టీ తాగితే.. రిజల్ట్స్ మీరే చూస్తారు అంటున్నారు నిపుణులు. మరీ ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పసుపు టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు టీ
పసుపు టీ

పసుపు టీ

Turmeric Tea For Weight Loss : మీరు ఉదయం లేవగానే 1 కప్పు పసుపు టీ తాగండి. లేదా మీరు రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు కూడా దీనిని తీసుకోవచ్చు. అలాంటప్పుడు రాత్రి 8 నుంచి 8.30 గంటల మధ్య భోజనం చేయాల్సి ఉంటుంది. గంటన్నర తర్వాత పసుపు టీ తాగండి. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా..శరీరంలోని అనేక సమస్యలను నయం చేస్తుంది.

పసుపు టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీని ప్రయోజనాలు తెలిస్తే.. మీరు దీనిని మాయా పానీయం అని కూడా పిలుస్తారు. పసుపు టీ ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలకు ఉపశమనం అందిస్తుంది. అయితే ఆయుర్వేదంలో పసుపునకు గొప్ప ఔషధం హోదా ఇచ్చారు. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా PCOD రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. థైరాయిడ్, కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. మోకాళ్ల సమస్యలతో బాధపడేవారు అంటే ఆర్థరైటిస్‌తో బాధపడేవారు కూడా పసుపు టీ తాగొచ్చు.

పసుపు టీ ఎలా తయారు చేయాలి?

2 టేబుల్ స్పూన్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడితో గ్లాస్ కంటైనర్ నింపండి. మీరు ప్రతిరోజూ దీని నుంచి మీ పసుపు టీని తయారు చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒక కప్పులో 1/4 టీస్పూన్ పసుపు టీ మిశ్రమాన్ని ఉంచండి. ఇప్పుడు దానికి వేడినీరు కలపండి. 5 నుంచి 7 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. అనంతరం దానిని ఆపేసి వేడివేడిగా తాగాలి. 15 రోజులు ఇలా తాగితే ఫలితాలు మీరే చూడవచ్చు. పసుపు టీని రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు తాగవద్దు.

తదుపరి వ్యాసం