తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivation On Stay Positive And Keep Believing Better Things Are Ahead

Tuesday Quote : మీపై మీకు నమ్మకముంటే చాలు.. అన్ని ఆటోమేటిక్​గా సెట్​ అవుతాయ్..

23 August 2022, 6:30 IST

    • ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టంగా, సవాలుతో కూడినట్లు ఉండవచ్చు. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే వారే విజయం సాధిస్తారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలంటే.. ఆ విషయాలపై మనకు క్లారిటీ అవసరం. సరైన క్లారిటీ ఉంటే.. మీరు మీ భయాన్ని అధిగమించి.. విజయవంతంగా ముందుకు సాగుతారు. లేదంటే మీరు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. మన సమస్యలకు, లేదా బాధలకు ఎవరో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీలోపల ఎక్కడో దాక్కొని ఉన్న మీ అంతరాత్మను ప్రశ్నించండి. అదే మీకు తగిన సమాధానం ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని మనం నమ్మడం చాలా ముఖ్యం. అప్పుడే మన పరిస్థితులు మెరుగుపడతాయి.

ట్రెండింగ్ వార్తలు

Poppy Seeds Benefits : గసగసాలతో అనేక ప్రయోజనాలు.. కంప్లీట్ సమాచారం మీ కోసం

Wedding Dress : పెళ్లి బట్టలు చాలా సంవత్సరాలు భద్రపరిచేందుకు కొన్ని సింపుల్ టిప్స్

Cool Places in AP: వేసవిలో విశాఖపట్నానికి వెళితే కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రదేశాలు ఇవే

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

మీరు మీకోసం మాత్రమే కాకుండా మీ సహాయం అవసరమైన అనేక మంది కోసం స్ట్రాంగ్​గా నిలబడాలి. జీవితం మీకు అనేక సమస్యలను కలిగిస్తుంది. అనేక సవాళ్లను విసురుతుంది. అవి అనివార్యం. ఎవరూ వాటిని తప్పించుకోలేరు. వాటిని ధైర్యంగా ఎదుర్కునే వాళ్లే జీవితంలో సక్సెస్​ అవుతారు. అంతేకానీ నాకు మాత్రమే సమస్యలు వస్తున్నాయని కృంగిపోకూడదు. ఓ సామెత ఉంటుంది కదా.. లైఫ్ మీకు నిమ్మకాయలు ఇస్తే.. నిమ్మరసం చేసుకుని తాగండి అని.. అలానే మన కష్టాలు, లేదా ఇబ్బందుల నుంచి మీరు పాజిటివిటీ వెతుక్కుంటే మంచిది. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగితే.. జీవితం మీకు తప్పకుండా మంచే చేస్తుంది.

అందుకే ఎవరు మిమ్మల్ని నమ్మినా.. నమ్మకున్నా.. మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ నమ్మకమే మీ బలం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అది మీకు ఎంతో సహాయం చేస్తుంది. ఎలాంటి తుఫాను వచ్చినా.. అది కలకాలం నిలవదు అని గుర్తించుకోండి. తుఫాను వస్తే జరిగే నష్టం భారీగానే ఉంటుంది. కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసుకోగల శక్తి మనకు ఉందని గుర్తించాలి. మీ సంకల్పం గొప్పది అయితే.. మీరు కోరుకుంది మీకు దక్కుతుంది.

ఎలాంటి సమయంలోనైనా... ఏ కష్టంలో ఉన్నా.. సానుకూలంగా ఉంటే చాలు. మీ ఆశకు నీరు పోసినట్టే. ప్రతికూల పరిస్థితులు వచ్చి వెళ్లిపోయేవే. ఆ సమయంలో మీరు సానుకూలంగా ఉంటే మీ సమస్యలు తగ్గిపోతాయి అని కాదు కానీ.. సమస్యను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇది మీ సమస్యలకు ఓ చక్కటి పరిష్కరాన్ని ఇస్తుంది. మీ భయాలను, బాధలను తగ్గించి.. ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేసే అవకాశముంది. మంచి పుస్తకాలు చదవండి. పాజిటివ్​గా ఉండే వ్యక్తులతో మాట్లాడండి. నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. ఇష్టమైన ఆహారం తినండి. బాగా పడుకోండి. ఇవన్నీ మీకు పాజిటివ్ వైబ్స్​ని ఇస్తాయి. ఇవి మీ బలాన్ని రెట్టింపు చేసి.. జీవితంలో ముందుకు సాగేందుకు సహాయం చేస్తాయి. తద్వారా ఇబ్బందులను అధిగమించి విజయం సాధిస్తాము.

టాపిక్