తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Schemes | ఈ పథకాల్లో పొదుపు చేస్తే.. మీ సంపద సురక్షితం.. విత్ బెనిఫిట్స్

Best Schemes | ఈ పథకాల్లో పొదుపు చేస్తే.. మీ సంపద సురక్షితం.. విత్ బెనిఫిట్స్

HT Telugu Desk HT Telugu

20 April 2022, 9:40 IST

    • మీ ఆర్థిక వృద్ధికై డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా? కానీ ఏ పొదుపు పథకాలలో మీ సంపద సురక్షితంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీ ఆర్థిక వృద్ధికై ప్రభుత్వం ధృవీకరించిన పథకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు

Government Schemes | సాధారణ ఎఫ్​డీలు చాలా తక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. దీర్ఘకాలంవరకు ప్రభావవంతంగా ఉండవు. మరోవైపు మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు మార్కెట్‌లు ఉన్నా.. వాటి గురించి అవగాహన లేని వారికి అవి ప్రమాదకరమైన పెట్టుబడి ఎంపికలు. మరి పొదుపు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే.. మీ కోసం ప్రభుత్వం ధృవీకరించిన పథకాలు ఉన్నాయి. ఇవి మీ సంపదను సురక్షితమైన మార్గాలలో నిర్మించుకోవడానికి ఇవి మీకు కచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఆ పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)

బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మీ బ్యాంక్‌లో... సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టండి. ఈ విధంగా మీరు ప్రస్తుత మార్కెట్ విలువతో కొనుగోలు చేసి, లాకింగ్ వ్యవధి తర్వాత భవిష్యత్ మార్కెట్ విలువకు వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి వార్షిక వడ్డీని కూడా పొందుతారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది చాలా సమర్థవంతమైన తక్కువ-రిస్క్ సేవింగ్స్ ప్లాన్. పైగా ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి మంచి ఎంపిక. అధిక వడ్డీ రేటుతో (7.1%) డిపాజిట్ చేసిన మొత్తం, సంపాదించిన వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. కానీ ఎక్కువ డిపాజిట్లతో ఐదేళ్ల బ్లాక్‌కు దానిని పొడిగించవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటుతో డిపాజిట్లు లేకుండా ఖాతాను కూడా ఉంచవచ్చు.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు (SCSS)

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లకు.. 60 ఏళ్లు పైబడిన ఎవరైనా లేదా పదవీ విరమణ చేసిన 55 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా అర్హులే. ఈ పథకం 7.4% వడ్డీ రేటుతో.. అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. రూ. 1,000 నుంచి గరిష్ట మొత్తం రూ. 15 లక్షల వరకు అనుమతిస్తారు. మీ తల్లిదండ్రులను వారి సమీపంలోని పోస్టాఫీసులు లేదా ధృవీకరించబడిన బ్యాంకు నుంచి ఈ పథకాన్ని పొందడానికి సహాయం చేయండి.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP)

ఈ ప్లాన్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్​ని కలిపి ఒక స్కీమ్‌గా చేస్తుంది. సాధారణ ప్రీమియం చెల్లింపుల్లో కొంత భాగం బీమా కవరేజ్. మిగిలినది బాండ్లు, ఈక్విటీలు లేదా రెండింటిలో పెట్టుబడిగా పెడతారు. జీవిత బీమా, సంపద నిర్మాణం, పిల్లలకు ఉన్నత విద్య, పదవీ విరమణ ఆదాయం కోసం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్​ని ఉపయోగించవచ్చు. పాలసీ వ్యవధిలో వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు దాటితే వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తారు.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి పథకం ఆడపిల్లల కోసం పొదుపు మార్గాన్ని అందిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల కాలవ్యవధితో లేదా అమ్మాయి పెళ్లి చేసుకునే వరకు.. తల్లిదండ్రులు రూ. 7.60% వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

టాపిక్