తెలుగు న్యూస్  /  Lifestyle  /  Thursday Quote On Failure Will Never Overtake Me If My Determination To Succeed Is Strong Enough.

Thursday Motivation | వైఫల్యాలతో కృంగిపోకండి.. అవే మీ విజయానికి నాంది..

HT Telugu Desk HT Telugu

19 May 2022, 6:00 IST

    • ఏదైనా సాధించాలనుకునే క్రమంలో వైఫల్యాలను చవి చూసే అవకాశముంటుంది. ఆ సమయంలో మీ శక్తి, సామర్థ్యాలను కోల్పోకుండా ఉండడమే అసలైన విజయం. కొందరు ఫెయిల్యూర్​ రాగానే.. గివ్​ అప్ ఇచ్చేస్తారు. మరి కొందరు ఆ వైఫల్యాలతోనే విజయానికి ఓ మార్గం వెతుక్కుంటారు.
వైఫల్యాలే విజయానికి నాంది
వైఫల్యాలే విజయానికి నాంది

వైఫల్యాలే విజయానికి నాంది

Thursday Motivation | రిజల్యూషన్ అనేది మనలోని అత్యంత బలమైన, ముఖ్యమైన భావోద్వేగం. జీవితంలో విజయం సాధించిన, లేదా సాధించాలనుకునే వ్యక్తులు ఈ రిజల్యూషన్ విషయంలో చాలా దృఢంగా ఉంటారు. వారు తమ భావాలను స్వాధీనం చేసుకోవడానికి వైఫల్యాన్ని ఎప్పుడూ అనుమతించరు. అందుకే మీరు కూడా విజయం సాధించాలంటే.. మీ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకోండి తప్పా.. మీ ఆశయాన్ని వదులుకోకండి. మీ లక్ష్యాన్ని మీరు నిర్ధారించుకోనట్లయితే.. మీరు విజయాన్ని ఎప్పటికీ పొందలేరు. అంతేకాకుండా మీరు తగినంత స్ట్రాంగ్​గా లేకపోతే.. మీరు కష్టపడి పని చేసే శక్తిని పొందలేరు. కరెక్ట్​గా చెప్పాలంటే.. కృషికి సంకల్పం ఇంధనం.

ట్రెండింగ్ వార్తలు

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

Foods For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి

వైఫల్యాలు అనేవి మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి. మీరు ఆ పాఠాలను కచ్చితంగా పరిగణించగలిగితే.. అవే మీకు చాలా విషయాలు నేర్పుతాయి. మీరు విజయానికి చేరువకావడానికి ఈ వైఫల్యాలను మార్గాలుగా మార్చుకోవాలి. పాత ధోరణుల్లో మార్పుల్లు చేసి.. కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. అలాగే మీ సంకల్పం.. మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే వ్యక్తిగా మారుస్తుంది.

టాపిక్