తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation | నిజాయితీగా, కరెక్ట్​గా ఉంటే చాలు.. ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

Thursday Motivation | నిజాయితీగా, కరెక్ట్​గా ఉంటే చాలు.. ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

HT Telugu Desk HT Telugu

12 May 2022, 8:02 IST

    • మీ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.. ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకున్నది ఒకటంటే ఒకటే లైఫ్.
ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్
ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

ఒన్ లైఫ్​ ఈజ్​ ఎనఫ్

Thursday Motivation | నిరంతర విందులు, ఉల్లాసంగా ఉండటం ఆనందాన్ని ఇచ్చేవే. కానీ ఇవి సంతృప్తినిస్తాయని అనుకోకండి. ఇది చివరికి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది కూడా. అందుకే వీలైనంత ఆనందాన్ని అనుభవించండి. మంచి స్నేహితులను ఎంచుకుని.. ప్రతికూల వ్యక్తులను నివారించండి. ఫలవంతమైన, సానుకూల మార్గాల్లో... వ్యక్తిగా నిరంతరం అభివృద్ధి చెందండి. జ్ఞానాన్ని నేర్చుకోండి. పంచుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

మీరు కష్టాల్లో కూరుకుపోయి ఇతరులను తప్పించడంలో అర్థం లేదు. ఇతరులకు హెల్ప్ చేసి మీరే ఏడుస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఒకరికి హెల్ప్ చేయడమనేది తప్పుకాదు కానీ.. దీర్ఘకాలం వరకు విచారకరమైన ఆలోచనలు, దుఃఖం ఇచ్చే ఫలితాలు మాత్రం మీకు కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిరుత్సాహంలో ఉంటే.. మంచి స్నేహితులను కనుగొనండి. మిమ్మల్ని ఎక్కువగా నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. ఇది అనేక రకాల అనారోగ్యాలను నయం చేస్తుంది. అప్పుడు మీరు మరణ శయ్యపై ఉన్నా.. మీరు ఈ జీవితం పట్ల సంతృప్తి చెందుతారు. ఏమి చేయాలనుకున్న ఈ జీవితంలోనే ఫుల్ ఫిల్ చేసుకోండి. ఇంకో లైఫ్​ ఉంటుందా లేదా అనే ప్రశ్నే ఉండదు.

 

టాపిక్

తదుపరి వ్యాసం