తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Sexual Health | ఇవి తింటే చాలు.. స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది..

Sexual Health | ఇవి తింటే చాలు.. స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది..

HT Telugu Desk HT Telugu

15 March 2022, 9:07 IST

    • పిల్లలను పొందేందుకు చాలా మంది దంపతులు ప్రయత్నిస్తుంటారు. గర్భం దాల్చడమనే ప్రక్రియ స్త్రీ, పురుష ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. రకరకాల సమస్యల వల్ల స్త్రీలు గర్భం దాల్చేందుకు ఇబ్బందులు పడతారు. మరికొందరు పురుషులలో స్పెర్మ్ కౌంట్​లో ఇబ్బందులు ఉంటాయి. అయితే స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పదార్థాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహారం
స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహారం

స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహారం

Sexual Health | దంపతులు గర్భం దాల్చడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఇప్పటి వరకు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపకపోతే చూపాల్సిన సమయం వచ్చింది. మీరు పిల్లలను ప్లాన్ చేస్తున్నట్లయితే కచ్చితంగా.. వీటిని తినాల్సిందే అంటున్నారు నిపుణులు.

పుష్కలంగా పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్‌తో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే పురుషులల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుందని.. రెడ్ మీట్, వేయించిన ఆహారాలు, చక్కెరతో తియ్యటి పానీయాలు, డెజర్ట్‌లు ఎక్కువగా తినే పురుషులలో స్పెర్మ్ కౌంట్స్ తక్కువగా ఉంటాయని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ పవన్ దేవేంద్ర కొన్ని సూపర్ ఫుడ్​లను సూచించారు. ఇవి సంతానోత్పత్తి, స్పెర్మ కౌంట్​ను పెంచుతాయని వెల్లడించారు. అవి ఏంటంటే..

గుడ్లు

ఇవి ప్రోటీన్, విటమిన్ ఇతో నిండి ఉంటాయి. గుడ్లు స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరిచి.. వీర్య కణాల సంఖ్యను మెరుగుపరుస్తాయి. వాటిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయని పవన్ వెల్లడించారు.

బెర్రీలు

స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చాలా అవసరమైన రక్షణను అందిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన, బలమైన స్పెర్మ్‌లను తయారు చేయడంలో సహాయపడతాయి.

అరటిపండు

అరటిపండులో మెగ్నీషియం, విటమిన్లు బి1, సి పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తిని పెరుగుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ చలనశీలతకు సహాయపడుతుంది.

బచ్చలికూర

బచ్చలి కూరలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దానిమ్మపండు

దానిమ్మపండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. స్పెర్మ్‌లు పాడవకుండా కాపాడతాయి.

టొమాటోలు

అవి విటమిన్ సి, లైకోపీన్‌తో నిండి ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఎల్-అర్జినైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ వాల్యూమ్‌ను మెరుగుపరుస్తుంది. మీ చక్కెర డెజర్ట్‌ను డార్క్ చాక్లెట్ ముక్కతో భర్తీ చేయడానికి ప్రయత్నించండి.

గుమ్మడికాయ గింజలు

అవి మీ పునరుత్పత్తి ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి స్పెర్మ్ వైరలిటీని పెంచుతాయి.

క్యారెట్లు

ఇందులో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది మీ స్పెర్మ్ ఫ్రీ రాడికల్స్ ద్వారా దెబ్బతినకుండా నిరోధించడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్.

వాల్‌నట్‌లు

వాల్​నట్​లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. అవి మీ స్పెర్మ్‌ల చలనశీలతను మెరుగుపరుస్తాయి.

ఆస్పరాగస్

వీటినే పిల్లి తీగలు కూడా అంటారు. ఇందులో స్పెర్మ్ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి ఉంటుంది. ఈ గ్రీన్ వెజిటేబుల్‌ని రోజూ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ సహజంగా పెరుగుతుంది. అంతేకాకుండా, ఇది ఫ్రీ-రాడికల్ నష్టం నుంచి స్పెర్మ్‌ను కాపాడుతుంది. అంతిమంగా, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతే కాకుండా మీరు మీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు.

సరైనా ఆహరం తీసుకుంటూ మీ స్పెర్మ్ కౌంట్​ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని డాక్టర్ పవన్ దేవేంద్ర సూచించారు. పిల్లలను పొందడంలో పదార్థాలు కచ్చితంగా ఉపయోగపడతాయని పవన్ దేవేంద్ర తెలిపారు.