తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Never Reheat Foods : మీరు కచ్చితంగా తినే ఈ వంటకాలను మళ్లీ వేడి చేసి అస్సలు తినొద్దు

Never Reheat Foods : మీరు కచ్చితంగా తినే ఈ వంటకాలను మళ్లీ వేడి చేసి అస్సలు తినొద్దు

Anand Sai HT Telugu

03 February 2024, 16:45 IST

google News
    • Never Reheat Foods : కొన్ని రకాల ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమే.
మళ్లీ వేడి చేయకూడని ఆహారాలు
మళ్లీ వేడి చేయకూడని ఆహారాలు (Unsplash)

మళ్లీ వేడి చేయకూడని ఆహారాలు

ఈరోజుల్లో ఆహారం తాజాగా వండుకుని తినేందుకు చాలా మందికి సమయం ఉండటం లేదు. బిజీ షెడ్యూల్ వల్ల పొద్దున చేసిన ఆహారాన్ని రాత్రికి తింటారు. ఇలా మళ్లీ వేడి చేసి తినడం తప్పనిసరి అయింది. కొన్ని ఆహారాలు, ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు, వేడిచేసిన ప్రతిసారీ వాటి పోషకాలను కోల్పోతాయి. కొన్ని ఆహారాలు విషాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటాయి. అందుకే మళ్లీ వేడి చేయకూడదు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం అవుతుంది. ఒకసారి వేడి చేసి చల్లబడిన ఆహారాన్ని బాక్టీరియా చుట్టేస్తుంది. అది తినే వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వీలైనంత వరకు తాజా ఆహార పదార్థాలను తయారు చేసి తినండి. కింద చెప్పే కొన్ని ఆహారాలను తినకూడదు.

వేడి చేయకూడని ఆహారాలు

ఆహార ప్రమాణాల ఏజెన్సీ ప్రకారం, అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల విషం వచ్చే ప్రమాదం ఉంది. రైస్ మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియా ఉంటుంది. అన్నం మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు.

ఒకసారి మష్రూమ్ డిష్ తయారు చేసిన తర్వాత మళ్లీ వేడి చేయకూడదు. పుట్టగొడుగులలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మొదట వండినప్పుడు గరిష్ట మొత్తం అందుబాటులో ఉంటుంది. కానీ మళ్లీ వేడి చేసినప్పుడు ఈ ప్రోటీన్లు మరింత విచ్ఛిన్నమవుతాయి. దాని వినియోగం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. మష్రూమ్‌లోని ఏదైనా పదార్ధాన్ని మళ్లీ వేడి చేయకూడదు.

బంగాళాదుంపలలోని పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6 తిరిగి వేడి చేసినప్పుడు ప్రమాదకరమైన బ్యాక్టీరియా దాడి చేసే అంశాన్ని పెంచుతుంది. బ్యాక్టీరియా దాడిని నివారించడానికి వీలైనంత వరకు ఆహారం తాజాగా తీసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచి తినొచ్చు.

గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టినప్పుడు లేదా వేయించినప్పుడు దాని ప్రోటీన్లు ఆరోగ్యంగా ఉంటాయి. మళ్లీ వేడిచేసినప్పుడు తగ్గిపోతాయి. తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. గుడ్డు పదార్థాలను వేడిగా తీసుకోవాలి. మళ్లీ మళ్లీ వేడి చేస్తే.. ఆహారాన్ని విషపూరితం చేస్తుంది.

బచ్చలి కూర, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకుపచ్చ కూరలను ఎప్పుడూ మైక్రోవేవ్‌లో మళ్లీ వేడి చేయకూడదు. ఈ ఆకులలో నైట్రేట్లు కూడా ఉంటాయి. వాటిని మళ్లీ వేడి చేసినప్పుడు, ఇవి విషాలుగా మారతాయి. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కణాల విడుదలకు దారి తీస్తుంది.

చికెన్ కూడా చేయెుద్దు

చికెన్, పులుసు లేదా ఇతర పదార్ధాలను మళ్లీ వేడి చేయవద్దు. కోడి మాంసంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దానిని వేడి చేసిన ప్రతిసారీ, ప్రోటీన్లు మరింత తగ్గిపోతాయి. ఈ ఆహారాలు తీసుకున్నప్పుడు జీర్ణక్రియ దెబ్బతింటుంది.

వాల్‌నట్ ఆయిల్, బటర్‌నట్ ఆయిల్, హాజెల్‌నట్ ఆయిల్, గ్రేప్‌సీడ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మళ్లీ వేడి చేయకూడదు. వీటిని మళ్లీ వేడి చేస్తే చాలా సమస్యలు వస్తాయి.

బీట్‌రూట్‌ మళ్లీ వేడి చేస్తే విషం

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. మళ్లీ వేడిచేసినప్పుడు విషపూరితం కావచ్చు. బీట్‌రూట్‌ను మళ్లీ వేడి చేసినప్పుడు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను విడుదల చేస్తుంది. ఈ లక్షణాలు ప్రమాదకరమైనవి మాత్రమే కాదు.. వాటిని తినేవారిలో నపుంసకత్వానికి, క్యాన్సర్‌కు కారణమవుతాయి.

తదుపరి వ్యాసం