తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navratri Fasting Diet । ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి ఉపాహారాలు తీసుకోవాలి?!

Navratri Fasting Diet । ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి ఉపాహారాలు తీసుకోవాలి?!

HT Telugu Desk HT Telugu

26 September 2022, 13:05 IST

google News
    • శరన్నవరాత్రులలో భక్తిభావం పెరుగుతుంది. చాలా మంది ఉపవాస దీక్షల్లో ఉంటారు. అయితే ఉపవాస సమయంలో ఎలాంటి ఉపాహారాలు తీసుకుంటే ఉత్తమమో ఇక్కడ తెలుసుకోండి.
Navaratri Fasting Diet
Navaratri Fasting Diet

Navaratri Fasting Diet

నవరాత్రి (Navratri 2022) ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ సమయంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. కొంతమంది మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం కఠోర ఉపవాస నియమాలను పాటిస్తారు. అయితే ఎక్కువ కాలం పాటు కడుపును ఖాళీగా ఉంచకుండా తేలికైన అల్పాహారం తీసుకోవచ్చు. ఇలా అల్పాహారం తీసుకోవడం వలన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది, జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా పోషక విలువలతో కూడినదై ఉండాలి. తక్కువ తిన్నప్పటికీ, ఎక్కువ శక్తినిచ్చేది అయి ఉండాలి. అప్పుడే ఆకలిని నిలుపుకోగలము, అప్పుడే ఉపవాస దీక్షను నిష్టగా ఆచరించగలము.

అంతేకాదు, ఉపవాసం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. అవేంటో వివరంగా తెలియాలంటే ఎరుపు లింక్ క్లిక్ చేసి చూడండి.

ఇకపోతే, ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు సరైన ఆహారం అంటే ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు? భక్తితో పాటు బరువు తగ్గడం కూడా మీ ప్రాధాన్యత అయితే డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మంచి శక్తిని, ఆరోగ్యాన్ని అందించే కొన్ని ఆహారాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇవి బరువును తగ్గించి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మీకు ఉపవాసం చేసిన సంతృప్తి లభిస్తుంది. అవేంటో చూడండి.

Navratri Fasting Diet - ఉపవాసం కోసం ఉత్తమ ఆహారాలు

ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉపవాసం నిరాటంకంగా సాగుతుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కొలెస్ట్రాల్, డైటరీ ఫైబర్, ఫోలేట్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, పిరిడాక్సిన్, రిబోఫ్లావిన్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-కె ఉన్నాయి. మీరు రోజంతా ఒకటి నుండి రెండు కొబ్బరి బొండాల నీరు త్రాగవచ్చు. దీనితో మీ శరీరంలో నీటి కొరత ఉండదు, ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్

ఉపవాస సమయంలో, మీరు అల్పాహారంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. వీటిని తినడం ద్వారా, మీరు అనేక పోషకాలను పొందుతారు, నీరసంగా అనిపించదు. డ్రై ఫ్రూట్స్‌ని మీ ఫాస్టింగ్ డైట్‌లో చేర్చుకోవడానికి రాత్రిపూట నానబెట్టండి.

బొప్పాయి

ఉపవాస సమయంలో ఎప్పటికప్పుడు కడుపు శుభ్రం అవదు కాబట్టి తరచుగా సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉపవాస సమయంలో బొప్పాయి పండు తినండి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. అలాగే మీరు ఉపవాసం విరమించేటప్పుడు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా తప్పుతుంది.

పాలు

పాలలో ప్రోటీన్, కాల్షియం, రైబోఫ్లావిన్ ఉంటాయి. పాలు తాగడం వల్ల మీకు పూర్తి పోషకాహారం లభిస్తుంది. పాలు తాగిన తర్వాత కడుపు నిండైన అనుభూతి కలుగుతుందు. మీకు ఆకలి కూడా ఉండదు.

తదుపరి వ్యాసం